Battle of Galwan: సల్మాన్ మూవీపై రగిలిపోతున్న చైనా..! కేంద్రం కౌంటర్..!
2020లో కరోనా సమయంలో అదను చూసి భారత సరిహద్దుల్ని ఉల్లంఘించేందుకు ప్రయత్నించి విఫలమైన చైనా(china) ఆ దుగ్దతో మన సైనికులపై దాడులకు దిగింది. ఇందులో 20 మందికి పైగా భారత సైనికులు అమరులయ్యారు. చైనా కూడా అంతకు మించిన నష్టాల్ని చవిచూసింది. అయితే ఈ నష్టాల్ని అంగీకరించేందుకు ఇష్టపడని చైనా తీరును ఎండగట్టేలా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బాటిల్ ఆఫ్ గల్వాన్ (battle of galwan) పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది చైనాకు కంటగింపుగా మారింది.
తాజాగా విడుదలైన 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' మూవీ టీజర్ పై చైనా మీడియా తీవ్రంగా స్పందించింది. ఈ చిత్రం వాస్తవాలను వక్రీకరిస్తోందంటూ ఎదురుదాడికి దిగింది. సల్మాన్ ఖాన్ నటించిన ఈ చిత్రం 2020లో తూర్పు లడఖ్‌లోని గల్వాన్‌లో భారత, చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణల ఆధారంగా రూపొందించారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ 16 బీహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బిక్కుమల్లా సంతోష్ బాబు పాత్రను పోషించారు. అతను చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళాలతో పోరాడుతూ వీరమరణం పొందుతాడు. ఈ సినిమాలో పేర్కొన్న అంశాలు వాస్తవాలు దూరంగా ఉన్నాయంటూ చైనా మీడియా ఆరోపిస్తోంది. దీనిపై కేంద్రం ఇవాళ స్పందించింది.

భారతదేశంలో "కళా స్వేచ్ఛ" ఉందని, ఈ స్వేచ్ఛను వినియోగించుకుని సినిమాలు తీసే హక్కు చిత్రనిర్మాతలకు ఉందని కేంద్రం తేల్చిచెప్పేసింది. భారత్ భావ ప్రకటనా స్వేచ్ఛ ఉన్న దేశం, సినిమాటిక్ వ్యక్తీకరణ దానిలో అంతర్భాగమని తెలిపింది. ఈ కళాత్మక స్వేచ్ఛ ప్రకారం భారతీయ చిత్రనిర్మాతలు సినిమాలు తీయడానికి అవకాశం కలిగి ఉన్నారని పేర్కొంది. తద్వారా చైనా మీడియాకు కౌంటర్ ఇచ్చింది. అలాగే ఈ సినిమాపై సందేహాలు ఉంటే వివరణల కోసం భారత రక్షణ మంత్రిత్వ శాఖను సంప్రదించవచ్చని కూడా తెలిపింది. దీంతో పాటు ఈ సినిమాలో ప్రభుత్వానికి ఎటువంటి పాత్ర లేదని వెల్లడించింది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications