వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెట్రో స్టేషన్ ఎక్కి పైనుంచి దూకిన యువతిని కాపాడిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది(వీడియో)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఓ యువతి మెట్రో స్టేషన్‌కి ఎక్కి ఆత్మహత్యకు యత్నించింది. అయితే, మెట్రో స్టేషన్‌ పైనుంచి దూకిన ఆమెను సీఐఎస్ఎఫ్ సిబ్బంది కాపాడారు. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలోని అక్షరధామ్ మెట్రో స్టేషన్‌లో గురువారం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఓ యువతి ఆత్మహత్య చేసుకునేందుకు అక్షరధామ్ మెట్రో స్టేషన్ పైకి వెళ్లి గోడపైకి ఎక్కింది. విషయం తెలుసుకున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మెట్రో స్టేషన్ సిబ్బంది, సీఐఎస్ఎఫ్ జవాన్లు ఆమెను మాటల్లో పెట్టి రక్షించే ప్రయత్నం చేశారు.

 Delhi: A Girl Jumps Off Delhi Metro’s Akshardham Station

ఆత్మహత్య చేసుకోవద్దని ఎంత చెప్పినా.. ఆ యువతి పట్టించుకోలేదు. ఎలాగైనా ఆమెను కాపాడేందుకు సీఐఎస్ఎఫ్ సిబ్బంది ప్రయత్నించారు. ఆమె మెట్రో స్టేషన్ పైనుంచి దూకబోయే ముందు మెట్రో స్టేషన్ కింద రక్షణ వలను ఏర్పాటు చేశారు. యువతిని కాపాడేందుకు ఆమె వద్దకు వెళ్లే ప్రయత్నం చేయగా.. యువతి కిందకు దూకింది.

అయితే, ఆమె రక్షణ వలలో పడటంతో స్వల్పగాయాలతో బయటపడింది. ముందు జాగ్రత్తగా అధికారులు పిలిపించిన అంబులెన్స్‌లో ామెను లాల్ బహదూర్ శాస్త్రి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సీఐఎస్ఎఫ్ అధికారిక ట్విట్టర్‌‍లో పోస్టు చేయడంతో వైరల్ మారింది. అక్కడున్న మరికొందరు కూడా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. యువతి ప్రాణాలను కాపాడిన సీఐఎస్ఎఫ్ సిబ్బందిని నెటిజన్లు ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

English summary
Delhi: A Girl Jumps Off Delhi Metro’s Akshardham Station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X