ఢిల్లీ ఎన్నికలు: కేజ్రీవాల్‌కి కిరణ్ బేడీ కౌంటర్ ఇస్తుందా?

న్యూఢిల్లీ: మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ భారతీయ జనతా పార్టీలో చేరడంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్ధిని బీజేపీ అధికారకంగా ప్రకటించకపోయినా కిరణ్ బేడీకే ఆ అవకాశం దక్కనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో ఢిల్లీ అంసెబ్లీ ఎన్నికల పోరు అరవింద్ కేజ్రీవాల్ వర్సెస్ కిరణ్ బేడీగా మారిపోయాయి. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో ఫిబ్రవరి 7న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈసారి ప్రధానంగా పోటీ బీజేపీ-ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

గతంలో అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడీ ఇద్దరూ అన్నా హాజారే లోక్‌పాల్ ఉద్యమంలో కలిసి పనిచేశారు. దీంతో కేజ్రీవాల్‌కు ఆమె గట్టి పోటీ ఇస్తారనే అంచనాలు ఉన్నాయి. అవినీతి వ్యతిరేక పోరాటయోధుడు అన్న పేరు కేజ్రీవాల్‌కు కలిసివచ్చే అంశం. ఆమ్ ఆద్మీ పార్టీకి పేద ప్రజల మద్దతు పుష్కలంగా ఉందని విశ్లేషకులు అంచనా. ఐతే ఢిల్లీ పోలీసు విభాగంలో కిరణ్ బేడీ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.

Delhi Assembly Elections 2015: Can Kiran Bedi counter Arvind Kejriwal?

అరవింద్ కేజ్రీవాల్:
బలాలు
* అవినీతి వ్యతిరేకిగా మంచి గుర్తింపు
* ఢిల్లీ నగరంలోని పేదలు, దిగువ, మధ్యతరగతి కుటుంబాల్లో ఆప్‌కు చెక్కుచెదరని ఓటుబ్యాంకు ఉంది.
* ఢిల్లీ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన నగర పోలీసులపై విమర్శల దాడి ఆపలేదు.

బలహీనతలు:
* గతేడాది 49 రోజులకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయటం కేజ్రీవాల్‌కు పెద్ద దెబ్బ.
* రాజీనామా చేసి తప్పుచేశానని ఆయన క్షమాపణ చెప్పినా... ప్రత్యర్థి పార్టీల నుంచి బాధ్యతలు వదిలేసి పారిపోయే వ్యక్తిగా విమర్శలకు వస్తున్నా సమాధానం చెప్పలేకపోతున్నారు.

కిరణ్ బేడీ
బలాలు:
* పరిపాలనా విభాగాల్లో ఆమెకు మంచి గుర్తింపు.
* ఎంతటి కఠినమైన సమస్యనైనా పరిష్కరించగలరన్న పేరుంది.

బలహీనతలు:
* అవకాశవాదంతో అభిప్రాయాలు త్వరగా మార్చుకుంటారు.
* రాజకీయాల్లో అనుభవం లేకపోవటం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+