విషం పెట్టినా చావలేదు.. నువ్ రా బావా లేపేద్దాం..

భారతదేశంలో పెళ్లి అనేది ఒక పవిత్ర సంప్రదాయం. గతంలో పెళ్లంటే నూరేళ్ల పంట అనే భావన ఉండేది. కానీ ప్రస్తుతం నూరు రోజులు కూడా ఆ కాపురం నిలబడటం లేదు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న సంఘటనలు చూస్తే యువత బెంబేలెత్తి పోతున్నారు. భర్తలను చంపేస్తున్న భార్యలు.. ఇప్పుడో కొత్త ట్రెండ్ గా మారిపోయింది. ప్రేమించిన ప్రియుడిని మర్చిపోలేకే భార్యలు ఈ పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. లవర్ ను మర్చిపోలేక కొన్ని రోజులకే భర్తలకు విడాకులిస్తున్నవాళ్లూ అధికంగానే ఉంటున్నారు. అయితే కొందరు మాత్రం ఏకంగా భర్తలకే స్పాట్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఇదో ట్రెండ్ గా మారిపోయినట్లు తెలుస్తోంది. దీంతో పెళ్లంటేనే యువత పారిపోతున్న పరిస్థితి ఎదురైతోంది.

తాజాగా దిల్లీలో ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. కట్టుకున్న భర్తను చిత్రహింసలు చేసి చంపింది ఆ భార్య. విషం పెట్టి.. ఆ తర్వాత కరెంట్ షాక్ ఇచ్చి హతమార్చినట్లు తేలింది. పోస్టుమార్టంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దిల్లీ ద్వారకా ప్రాంతంలో 35 ఏళ్ల వ్యక్తిని అతడి భార్య, లవర్ కలిసి కుట్రతో హత్య చేయడం సంచలనంగా మారింది.

దిల్లీ ద్వారకా ప్రాంతానికి చెందిన కరణ్ దేవ్ గత ఆదివారం అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అయితే.. భార్య సుస్మితా దేవ్, ఆమె బావ రాహుల్ దేవ్ ఇద్దరు కలిసి ఎలా చంపాలో ప్లాన్ వేసి మరీ హతమార్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. తన భర్త కరణ్ దేవ్‌ కరెంట్ షాక్‌ కు గురై మరణించాడని స్టోరీలు చెప్పింది. కానీ చివరకు కరణ్ దేవ్ సోదరుడి అనుమానంతో, మృతదేహానికి పోస్టుమార్టం చేయడంతో అసలు విషయం బయటపడింది.

Delhi Dwarka Shocker Wife and Brother-in-Law s Affair Ends in Husband s Murder with Sleeping Pills

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరణ్ దేవ్ కు అతడి భార్య సుస్మితా దేవ్..15 మత్తు మందు బిల్లలను ఆహారంలో కలిపి ఇచ్చింది. అయితే అవి పనిచేయకపోవడంతో ఆమె బావ రాహుల్ దేవ్ కు మెసేజ్ చేసింది. మత్తు మందు ఇచ్చాక ఎంత సేపటికి చనిపోతాడని అడిగింది. ఆహారం తీసుకుని ఇప్పటికే మూడు గంటలు అయిందని.. ఇంకా చావలేదు.. అని తెలిపింది. కరెంట్ షాక్ ఇవ్వమని చెప్పండంతో అలా షాక్ ఇచ్చి హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలిందని తెలిపారు. ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+