Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

delhi fog: ఢిల్లీని కమ్మేసిన పొగమంచు, చిమ్మచీకట్లు-110 విమానాల ఆలస్యం, భారీగా రైళ్లూ..

ఉత్తర భారత దేశంలో చలిగాలుల తీవ్రత నానాటికీ పెరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీని చలిగాలులతో పాటు పొగమంచు కూడా కమ్మేసింది. దీంతో దారి కూడా కనిపించని పరిస్దితి. దట్టమైన పొగమంచు నగరాన్ని కప్పేయడంతో ఇవాళ దాదాపు ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో నగరానికి వచ్చే విమానాలు, రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఇదే పరిస్ధితి ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

భారీ పొగమంచు కారణంగా ఢిల్లీకి రాకపోకలు సాగించే విమానాలు, రైళ్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. దారి కనిపించక 110 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఎయిర్ ట్రాఫిక్ వర్గాలు వెల్లడించాయి. ఇందులో దేశీయ, అంతర్జాతీయ విమానాలు కూడా ఉన్నాయి. అలాగే దాదాపు 25కు పైగా రైళ్లు కూడా ఇదే సమస్యతో ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇవాళ ఉదయం 8:30 గంటలకు 40 అంతర్జాతీయ విమానాలు, 67 దేశీయ విమానాల రాకపోకలపై మంచు ప్రభావం పడినట్లు అధికారులు చెప్తున్నారు.

delhi fog: 110 flights delayed, and number of trains affected due to poor visibility

ఢిల్లీలో ఇవాళ ఉదయం కేవలం 50 మీటర్ల వరకే దారి కనిపించే పరిస్ధితి (విజిబిలిటీ) ఉందని వాతావరణ విభాగం తెలిపింది.ఢిల్లీలోని ధౌలా కువాన్, ఇండియా గేట్, బారాపుల్లా మరియు ఢిల్లీ-నోయిడా సరిహద్దు ప్రాంతాల్లో ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీని ప్రభావం కచ్చితంగా మరిన్ని విమానాల రాకపోకలపై ఉండబోతోందని వాతావరణశాఖ చెబుతోంది.విమానాల ఆలస్యం నేపథ్యంలో ప్రయాణికులు తాజా సమాచారం కోసం సంబంధిత ఎయిర్ లైన్స్ ను సంప్రదించాలని ఢిల్లీ ఎయిర్ పోర్టు వర్గాలు సూచించాయి.

delhi fog: 110 flights delayed, and number of trains affected due to poor visibility

మరోవైపు దేశ రాజధానిలో దట్టమైన పొగమంచు ప్రజలపై ఆరోగ్యాలపైనా ప్రభావం చూపుతుందని ఐఎండీ హెచ్చరించింది. దట్టమైన పొగమంచులో పర్టిక్యులేట్ పదార్థం, ఇతర కాలుష్య కారకాలు ఉంటాయని, ఇవి ఊపిరితిత్తులలో చేరి, వాటిని మూసేస్తాయని హెచ్చరించింది. అలాగే శ్వాసలో గురక, దగ్గు, శ్వాస ఆడకపోవడాన్ని పెంచుతుందని కూడా హెచ్చరికల్లో పేర్కొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+