షాక్: డాక్యుమెంటరీ కోసం నిర్భయ ఫ్రెండ్ డబ్బు అడిగాడన్న లెస్లీ
న్యూఢిల్లీ: నిర్భయ ఉదంతంలో ఓ షాకింగ్ వెలుగు చూసింది! డాక్యుమెంటరీ కోసం నిర్భయ స్నేహితుడు దానిని తీసిన లెస్లీ ఉడ్విన్ తదితరులను డబ్బులు అడిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇండియాస్ డాటర్ పేరుతో లెస్లీ ఉడ్విన్ బీబీసీ డాక్యుమెంటరీని తీసిన విషయం తెలిసిందే.
ఇందులో నిందితుడు ముఖేష్ సింగ్ ఇంటర్వ్యూ కలకలం రేపింది. డాక్యుమెంటరీ కోసం ఇంటర్వ్యూ అడిగితే... నిర్భయ స్నేహితుడు అవనీంద్ర పాండే డబ్బులు డిమాండ్ చేసినట్లుగా లెస్లీ ఉడ్విన్ ఆరోపించారు.
నాలుగేళ్ల క్రితం ఢిల్లీలో నిర్భయ రేప్ ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆమె పైన ఆరుగురు నిందితులు అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, క్రూరంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు నిర్భయ స్నేహితుడు అవనీంద్ర పాండే ప్రత్యక్ష సాక్షి.

ఈ అత్యాచారం విషయమై లెస్లీ ఉడ్విన్ డాక్యుమెంటరీ రూపొందించారు. ఇప్పటికే ముఖేష్ సింగ్ ఇందులో చెప్పిన విషయాలు అందరూ ఖండిస్తున్నారు. తాజాగా లెస్లీ మరో బాంబు పేల్చారు. డాక్యుమెంటరీ ఇంటర్వ్యూ కోసం నిర్భయ స్నేహితుడు అవనీంద్ర పాండే డబ్బులు అడిగారని ఆరోపించారు. నాటి సంఘటన గురించి అడిగితే.. నేను చెప్పలేను అంటూ తాను ట్రబుల్‌లో ఉన్నానని చెప్పాడని లెస్లీ తెలిపారు.
కాగా, నిర్భయ స్నేహితుడు ఇటీవల మాట్లాడుతూ... ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీ బూటకం అని చెప్పిన విషయం తెలిసిందే. ఆ డాక్యుమెంటరీని కేంద్రం సమర్థిస్తూ.. అందులే రేపిస్ట్ వ్యాఖ్యలనే ప్రధానంగా చూపించారని విమర్శించాడు. లెస్లీ దీనిని ఏకపక్షంగా వండి వార్చిందని ఆరోపించారు. ఆ డాక్యుమెంటరీలోని సమాచారం బూటకమన్నాడు. ఈ నేపథ్యంలో ఆయన విమర్శల నేపథ్యంలో ఆమె ఇలా మాట్లాడారా అనే అనుమానాలు కూడా లేకపోలేదు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications