ఢిల్లీలో చట్టబద్ద మద్యపాన వయస్సు 21కి తగ్గింపు.. ఆప్ సర్కార్ మద్యం నూతన పాలసీ వెల్లడి

దేశ రాజధాని ఢిల్లీలో మద్యపానం కోసం చట్టబద్దమైన వయస్సును 25 నుండి 21 కి తగ్గించినట్లు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సోమవారం తెలియజేశారు. నూతన మద్యం విధానాన్ని ప్రకటించిన ఆయన ఢిల్లీ ప్రభుత్వం సంస్కరణలతో వార్షిక ఎక్సైజ్ ఆదాయంలో కనీసం 20 శాతం పెంపును ఆశిస్తోందని అన్నారు.ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సిసోడియా చెప్పారు.

ప్రభుత్వం మద్యం దుకాణాలు నడపదని స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా

ప్రభుత్వం మద్యం దుకాణాలు నడపదని స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా

దేశ రాజధానిలో కొత్త మద్యం షాపులు తెరవబోమని ఆయన ప్రకటించారు. మంత్రుల బృందం సిఫారసుల ఆధారంగా ఈ రోజు కొత్త ఎక్సైజ్ విధానాన్ని కేబినెట్ ఆమోదించింది. దేశ రాజధానిలో కొత్త మద్యం షాపులు తెరవవద్దని మరియు ప్రభుత్వం ఎటువంటి మద్యం దుకాణాలను నిర్వహించదని నిర్ణయించారు. ప్రస్తుతం, దేశ రాజధాని ఢిల్లీలో 60 శాతం మద్యం దుకాణాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది అని సిసోడియా విలేకరుల సమావేశంలో అన్నారు.

మద్యం మాఫియాకు చెక్ పెట్టేలా నూతన ఎక్సైజ్ పాలసీ

మద్యం మాఫియాకు చెక్ పెట్టేలా నూతన ఎక్సైజ్ పాలసీ

ఈ సంస్కరణలు నగరంలో మద్యం మాఫియా పాత్రను అంతం చేస్తాయని సిసోడియా చెప్పారు.

ఢిల్లీలో మొత్తం 850 మద్యం దుకాణాలకు ప్రభుత్వం అనుమతి ఉంది. అయితే మద్యం మాఫియా 2 వేల అక్రమ దుకాణాలను నడుపుతోంది . గత రెండేళ్లలో 7 లక్షలకు పైగా అక్రమ మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు, 1939 మందిని అరెస్టు చేశారు అని ఆయన చెప్పారు. మద్యం దుకాణాల సమాన పంపిణీని ప్రభుత్వం నిర్ధారిస్తుందని, తద్వారా మద్యం మాఫియా కు చెక్ పెట్టినట్లు అవుతుందని ఆయన పేర్కొన్నారు.

21ఏళ్ళ లోపు వారికి మద్యం దుకాణాల్లో అనుమతించకూడదన్న మంత్రి

21ఏళ్ళ లోపు వారికి మద్యం దుకాణాల్లో అనుమతించకూడదన్న మంత్రి

ఎక్సైజ్ విభాగంలో సంస్కరణల తరువాత 20 శాతం ఆదాయ వృద్ధి అంచనా వేయబడిందని ఆయన చెప్పారు.

కొత్త నిబంధనల ప్రకారం, మద్యం దుకాణానికి కనీస అనుమతించదగిన ప్రాంతం 500 చదరపు అడుగులు. అలాంటి స్టోర్ యొక్క ప్రధాన ద్వారం రహదారికి ముందు ఉండటానికి వీల్లేదు. అంతేకాదు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మద్యం దుకాణాలను నిర్మించాలి. దుకాణ యజమానులు తమ దుకాణాల దగ్గర బహిరంగ మద్యపానం జరగకుండా చూసుకోవాలి. 21 ఏళ్లలోపు వారిని మద్యం దుకాణాల్లో అనుమతించరాదని ఉప ముఖ్య మంత్రి మనీష్ సిసోడియా పేర్కొన్నారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+