'నాతో వాళ్లు క్లోజ్‌గా, ఇష్టం లేకున్నా పడుకున్నారు, సెక్స్ రాకెట్లో ఇరుక్కుంటాననుకోలేదు'

న్యూఢిల్లీ: తాను బంగారు పంజరంలో చిక్కుకున్న చిలుకునని ఢిల్లీ సెక్స్ రాకెట్ నుంచి బయటపడిన ఓ 23 ఏళ్ల రష్యా యువతి పేర్కొంది. ప్రతీంద్రనాథ్ తనను పావుగా వాడుకున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సఫ్దర్ గంజ్‌లోని ప్రతీంద్రనాథ్ ఇంటి నుంచి ఐటీ శాఖ అధికారులు ఆమెను కాపాడారు.

రష్యా రాయబార కార్యాలయం జోక్యంతో పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం ఆమె మణికట్టు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది.

తాను ఈ ఏడాది ఫిబ్రవరి 25వ తేదీన భారత్ వచ్చానని, అజయ్ అహ్లవాత్ తనకు స్పాన్సర్‌గా ఉన్నాడని, తన వీసా ఆగస్టు వరకు ఉందని ఆమె చెప్పింది. తనను బిజ్ వాసన్ ప్రాంతంలోని అహ్లవత్ ఫాం హౌస్‌కు తీసుకు వెళ్లారని, తనకు సంబంధించటిన అన్ని అంశాలను రాడియా అనే మహిళ చూసుకునేదని చెప్పింది.

Delhi sex racket victim to cops: I'm a bird in golden cage

పాంహౌస్‌లోనే ప్రతీంద్రనాథ్‌కు తనను పరిచయం చేశారని, తన బాగోగులు ఆయన చూసుకుంటారని చెప్పారని అన్నారు.

అదే సమయంలో తనను పెళ్లి చేసుకుంటానని ప్రతీంద్రనాథ్ మాటిచ్చాడని, తామిద్దరం దంపతుల్లా మెలిగామని చెప్పింది. ఐటీ ఉన్నతాధికారులకు, ఆయుధ డీలర్లకు తనను పరిచయం చేశాడని, వాళ్లు తనతో చనువుగా ఉన్నా పట్టించుకునే వాడు కాదని పేర్కొంది.

ప్రతీంద్రనాథ్ తన కంటే వయస్సులో చాలా పెద్దవాడని, తన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, కాబట్టి డబ్బు కోసం అతడిని పెళ్లి చేసుకోవాలనుకున్నానని, కానీ ఇలా సెక్స్ రాకెట్లో ఇరుక్కుంటానని ఊహించలేదని చెప్పింది. నేను తిరిగి మా దేశం వెళ్లిపోవాలనుకుంటున్నానని చెప్పింది.

తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఉంచుకున్న ప్రతీంద్రనాథ్ తనను ఐటీ అధికారులు, ఆయుధ డీలర్లకు పరిచయం చేశాడని, తన ఇష్టానికి వ్యతిరేకంగా ఇద్దరు వ్యక్తులతో పడుకున్నానని చెప్పింది. కానీ వారు ఎవరో తనకు తెలియదని పేర్కొంది. ప్రతీంద్రనాథ్ తన కంటే మూడు రెట్ల వయస్సు వాడు అన్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+