ఈ 3 రైళ్లు చాలా చాలా ప్రత్యేకమైనవి
రైలు ప్రయాణమంటే చాలు.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు. తర్వాత సంతోషంగా రైలులో ప్రయాణం చేస్తారు. సూపర్ ఫాస్ట్, ఎక్స్ ప్రెస్, మెయిల్.. ఇలా రకరకాల పేర్లతో రైళ్లు ఉంటాయనే విషయం తెలిసిందే. అలాగే తక్కువ దూరం ప్రయాణించే రైళ్లను డెము, ఈము, మెము అనే పేర్లు వాడుతుంటారు. వీటికి అర్థాన్ని, ఏరకమైనవాటికి వీటిని ఉపయోగిస్తారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
DEMU రైళ్లు :DEMU రైళ్ల గురించి తెలుసుకుందాం.. DEMU అంటే డీజిల్ మల్టిపుల్ యూనిట్. డీజిల్‌తో తక్కువ దూరానికి ప్రయాణించే రైళ్లను డీఎంయూ రైళ్లు అంటారు. ఇటువంటి రైళ్లలో 3 వర్గాలుంటాయి. ఒకటి డీజిల్ ఎలక్ట్రిక్ DEMU, రెండోది డీజిల్ హైడ్రాలిక్ DEMU, మూడోది డీజిల్ మెకానికల్ DEMU రైళ్లుగా పిలుస్తారు. ఈ రైళ్లల్లో ప్రతి మూడు కోచ్‌ల తర్వాత ఒక పవర్ కోచ్ ఉంటుంది. దీనివల్ల వీటిని ఎనర్జీ ఎఫిషియెంట్ రైళ్లు అని కూడా పిలుస్తారు.

EMU రైళ్లు:EMU అంటే ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ ట్రైన్. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై వంటి పెద్ద మెట్రోలను వాటికి సమీపంలో ఉండే నగరాలు, పట్టణాలతో అనుసంధానించడానికి వీటిని ఉపయోగిస్తారు. ఇవి కరెంటుతో నడుస్తాయి. గంటకు 60 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ రైళ్లలో పాంటోగ్రాఫ్ అమర్చబడి ఉంటుంది. ఇది విద్యుత్తును రైలు ఇంజన్ కు అందజేస్తుంది.
MEMU రైళ్లు:MEMU రైళ్లు అత్యాధునిక సాంకేతికత, అధునాతన సౌకర్యాలతో నిండివుంటాయి. 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించడానికి వీటిని ఉపయోగిస్తారు. ఈ రైళ్లలోప్రతి 4 కోచ్‌ల తర్వాత పవర్ కార్ ఉంటుంది. దీని సహాయంతో రైలులోని ట్రాక్షన్ మోటార్ నడుస్తూ బండికి వేగాన్ని అందించడంలో సహాయపడుతుంది.












Click it and Unblock the Notifications