Home Loan: బ్యాంకు బంపరాఫర్ -సున్నా వడ్డీతో 20 ఏళ్ల కాల పరిమితికి హోమ్ లోన్ -ఇవీ వివరాలు..

ఉన్నోడు ఇళ్ల మీద ఇళ్లు కడతాడు.. లేనోడికి సర్కారు ఎలాగో సాయం చేస్తుంది.. ఎటొచ్చి మధ్యతరగి వేతన, చిరుద్యోగ జీవులున్నారే.. వాళ్లలో చాలా మందికి ఇల్లు కట్టుకోవడం జీవితకాల కల. ఊళ్లలో తల్లిదండ్రులు కట్టిన ఇళ్లలో ఉండలేక.. ఉద్యోగ్యాలు చేసే సిటీల్లో ఇళ్లు కొనలేక వేతన జీవుల వెతలు అన్నీ ఇన్నీ కావు. అలాంటోళ్ల సౌకర్యం కోసం హోమ్ లోన్ విధానం పుట్టుకొచ్చింది. దశాబ్దాల తర్వాత మళ్లీ హోమ్ లోన్ విధానంలో విప్లవాత్మక మార్పు ఒకటి సంచలనం రేపుతోంది..

 వడ్డీ తక్కువ ఎక్కడ..

వడ్డీ తక్కువ ఎక్కడ..

హోమ్ లోన్ తీసుకోవాలంటే మనకు సవాలక్ష ఆలోచనలు.. అన్ని బ్యాంకుల గురించి ఆరా తీసి ఎక్కడ వడ్డీ తక్కువగా ఉంటుంది.? ఎక్కడ సులభమైన రీతిలో , తక్కువ వడ్డీకే హోమ్ లోన్ వస్తుంది..? అన్న విషయాల గురించి తెగ వెతికేస్తుంటాం. తెలిసిన వారి వద్ద ఆరా తీస్తుంటాం. సాధారణంగా హోమ్ లోన్ వడ్డీ రేటు 7 శాతం నుంచి 15 శాతం వరకు ఉంటుంది. కొన్ని కొన్ని ప్రైవేటు బ్యాంకులయితే 20శాతం వరకు కూడా వడ్డీని తీసుకుంటున్నాయి. ఈక్రమంలో ఒక బ్యాంకు మాత్రం..

సున్నా వడ్డీకే హోమ్ లోన్..

సున్నా వడ్డీకే హోమ్ లోన్..

హోమ్ లోన్ రంగంలో విప్లవాత్మక పరిణామంగా ఓ బ్యాంకు వడ్డీ లేని రుణాన్ని అందిస్తోంది. అవును, అచ్చంగా 0శాతం వడ్డీతో హోమ్ లోన్ ఇస్తోంది. దాన్ని కూడా హరీబరీగా కట్టాల్సిన పనిలేదు. తాపీగా 20 ఏళ్ల కాల వ్యవధితో సులభమైన ఈఎమ్ఐతో చెల్లించుకునే బంపర్ ఆఫర్ ను ప్రకటించారు. అవసరం లేకున్నా హోమ్ లోన్ తీసుకోవాలనిపించేంతటి ఈ ఆఫర్ మన దేశంలో మాత్రం కాదు సుమా, యూరోపియన్ దేశం డెన్మార్క్ వాసులకు అక్కడి 'ది నోరెడా బ్యాంక్' ఇస్తోన్న ఆఫరిది.

అక్కడ వడ్డీ రేట్లు కూడా తక్కువే.

అక్కడ వడ్డీ రేట్లు కూడా తక్కువే.

వాస్తవానికి డెన్మార్క్ దేశంలోని వివిధ బ్యాంకుల్లో అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు తక్కువగానే ఉంటాయి. డెన్మార్క్ లోని జైస్కే బ్యాంక్ మొదట 10 ఏళ్ల కాలపరిమితితో 0.5శాతం వడ్డీతో హోమ్ లోన్ ను ఇవ్వడం ప్రారంభించింది. తాజాగా నోరెడా బ్యాంక్ దాన్ని 20 ఏళ్ల కాలపరిమితికి పెంచుతూ 0శాతాన్ని వడ్డీ రేటుగా నిర్ణయిస్తూ కీలక ప్రకటన చేశారు. దీంతో హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్న వారు ఆ బ్యాంక్ ముంగిట క్యూ కడుతున్నారు. భారత్ లోనూ ఇలాంటి ఆఫర్లు రావాలని కోరుకుందామా..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+