అక్కడో చీర.. ఇక్కడో పుర్రె..! ధర్మస్ధలలో అడుగుతీసి అడుగేస్తే శవాలే..!
కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న నేత్రావతీ నదీ తీరంలో ఉన్న ధర్మస్ధల ఆశ్రమంలో సంవత్సరాలపాటు మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగాయన్న సమాచారంతో జరుగుతున్న తవ్వకాలు రోజుకో సంచలనం రేపుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల తవ్వకాల్లో మహిళల పుర్రెలు, అస్తిపంజరాలు, అవశేషాలు, వస్తువులు లభిస్తూనే ఉన్నాయి. ఇవాళ కూడా 11వ స్పాట్ లో జరుగుతున్న తవ్వకాల్లో ఓ మహిళ పుర్రె, చీర లభించాయి.
ధర్మస్ధలలో సిట్ జరుపుతున్న తవ్వకాల్లో ఇవాళ మహిళ అస్దిపంజరం భాగాలతో పాటు చీర అవశేషాలు కూడా లభించడంతో ఈ ప్రాంతంపై నెలకున్న అనుమానాలు మరింత బలపడ్డాయి. ధర్మస్ధలను ప్రాంతాలుగా విభజించి సిట్ తవ్వకాలు నిర్వహిస్తోంది.
ఇందులో భాగంగా 10 ప్రదేశాలను ఇప్పటికే తవ్వారు. ఇవాళ 11వ ప్రదేశంలో తవ్వకాలు జరిపారు. ఇప్పటికే ఆరవ ప్రదేశంలో మానవ అవశేషాలు దొరికాయి.

ధర్మస్థలలో లైంగిక వేధింపులకు గురైన మహిళలు, బాలికల మృతదేహాలతో సహా అనేక మృతదేహాలను ఖననం చేయమని తనను బలవంతం చేశారని మాజీ పారిశుధ్య కార్మికుడు చేసిన ఆరోపణల ఆధారంగా ఈ తవ్వకాలు జరుపుతున్నారు. ఇందులో గుర్తించబడిన శ్మశాన వాటికలలో ఎక్కువ భాగం నేత్రావతి నది ఒడ్డునే ఉన్నాయి. ఇవాళ తవ్వకాలు జరిపిన స్థలం అయితే ఏకంగా 100 అడుగుల ఎత్తులో ఉంది.

ఇక్కడ మాజీ పారిశుధ్య కార్మికుడు అందించిన సమాచారంతో రెవెన్యూ, అటవీ, ఇతర శాఖల అధికారులతో కూడిన సిట్ బృందం తవ్వకాలు జరుపుతోంది. ఇందులో లభిస్తున్న ఆధారాలతో ఇక్కడ అంతు బట్టని విధంగా హత్యాచారాలు, మారణకాండ జరిగినట్లు అర్థమవుతోంది. దీంతో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటోంది. జూలై 3న దాఖలైన ఫిర్యాదు , మరుసటి రోజు ఎఫ్‌ఐఆర్ నమోదు తర్వాత సిట్ జూలై 11న ఆన్-సైట్ దర్యాప్తు చేపట్టింది. ఇప్పుడు సిట్ స్వాధీనం చేసుకున్న అవశేషాల గుర్తింపులను ఖరారు చేయడం, గుర్తించబడిన ఇతర ప్రదేశాలలో మరిన్ని మృతదేహాలను ఖననం చేశారా లేదా అని నిర్ణయించే పనిలో బిజీగా ఉంది.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications