మీడియా కంటపడకుండా జైలుకు వారు: డేరా బాబా కొడుకుపై హనీప్రీత్ ఇలా కుట్ర
డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్‌ను కలిసేందుకు అంబాలా సెంట్రల్ జైలుకు వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు మీడియా కంటబడకుండా ఉండేందుకు నానాతంటాలు పడ్డారు.
చండీగడ్: డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్‌ను కలిసేందుకు అంబాలా సెంట్రల్ జైలుకు వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు మీడియా కంటబడకుండా ఉండేందుకు నానాతంటాలు పడ్డారు.
Recommended Video


అంబాలా జైలులో హనీప్రీత్
గుర్మీత్ సింగ్‌ను పోలీసుల నుంచి తప్పించేందుకు ప్రయత్నించిన కేసులో హనీప్రీత్ సింగ్, సుఖదీప్‌లు రిమాండ్ ఖైదీలుగాహర్యానా అంబాలా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.

విచారణ నేపథ్యంలో
ఈ కేసు విచారణ నిమిత్తం, జైలులోనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంచకుల కోర్టులో నిందితులను అధికారులు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మరో పన్నెండు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి హనీప్రీత్‌ను న్యాయస్థానం జైలుకు అప్పగించింది. విచారణ నేపథ్యంలో హనీప్రీత్‌ను కలుసుకునేందుకు ఆమె అన్నావదినలు, సోదరి జైలుకి వచ్చారు.

మీడియా కంటపడకుండా
ఈ సందర్భంగా మీడియా కంటబడకుండా వారు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. సుమారు పావు గంట పాటు వారు నిందితులతో మాట్లాడారు. హనీప్రీత్ కోసం వారు పలు వస్తువులు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. కాగా, ఈ కేసులో తదుపరి విచారణ ఈ నెల 17న జరగనుందని కోర్టు తెలిపింది.

డేరా బాబా కొడుకును అలా తప్పించింది
ఇదిలా ఉండగా, డేరా సచ్చా సౌదాపై తన ఆధిపత్యం కొనసాగించేందుకు హనీప్రీత్ కుట్రపూరితంగా డేరా బాబా కొడుకు జస్నీత్‌ను ఎంఎస్‌జీ బ్యానర్ కింది బిజినెస్ వ్యవహారాల నుంచి తప్పించారని అంటున్నారు. తానే డేరా చీఫ్ వారసురాలిగా ఎదిగేందుకు ఆయనను వ్యవహారాల నుంచి తప్పించారని అంటున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications