వారు చేసిన సాయం మరువలేను: అమిత్ షా, ఆర్ఎస్ఎస్‌పై దిగ్విజయ్ సింగ్ ప్రశంసలు
న్యూఢిల్లీ: ఎప్పుడూ బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై విమర్శలు గుప్పించే కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్.. తాజాగా ఎవరూ ఊహించని విధంగా ప్రశంసలు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపైనా, ఆర్ఎస్ఎస్‌పైనా ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగామారింది.
గతంలో వారు చేసిన సాయం గురించి గుర్తు చేసుకుంటూ దిగ్విజయ్ సింగ్ మాట్లాడారు. నాలుగేళ్ల క్రితం(2017) తాము నర్మదా పరిక్రమ యాత్రను చేస్తున్న సమయంలో అమిత్ షా, ఆర్ఎస్ఎస్‌లు గొప్ప సాయం చేశారని అన్నారు. ఈ యాత్ర సమయంలో ఓరోజు రాత్రి 10 గంటల సమయంలో ఓ అటవీ ప్రాంతానికి చేరుకున్నామని, అది గుజరాత్‌కు సమీపంలో ఉన్నామని, రాత్రి సమయం కావడంతో ముందుకు వెళ్లలేకపోయామన్నారు.

ఏం చేయాలో, ఎటు వైపు వెళ్లాలో తెలియని అయోమయ స్థితిలో ఉండగా, సడెన్‌గా తమ వద్దకు ఓ ఫారెస్ట్ అధికారి వచ్చారని, తమకు పూర్తిగా సహకరించాలని అమిత్ షా ఆదేశించారని ఆ ఫారెస్ట్ అధికారి చెప్పినట్టు దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. గుజరాత్‌లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆ పార్టీపైనా, అమిత్ షాపైనా ఎన్నో విమర్శలు చేశానని, అయినప్పటికీ, తీర్థయాత్ర సమయంలో తాము ఎలాంటి ఇబ్బందులు పడకూడదని చెప్పి అమిత్ షా తమకు సహాయం చేశారని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు.
ఆహారపదార్థాలను కూడా ఏర్పాటు చేశారని తెలిపారు దిగ్విజయ్ సింగ్. ఇందుకు ఇప్పటి వరకు తాను అమిత్ షాను కలిసి ధన్యవాదాలు చెప్పలేకపోయానని తెలిపారు. ఓ ప్రాపర్ చానల్ ద్వారా తెలియజేశానని చెప్పారు. ఇక భరూచ్ ప్రాంతం గుండా యాత్ర వెళ్తున్న సమయంలో తమ బృందానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యకర్తలు మాంఝీ ఆశ్రమంలో విడిది ఏర్పాటు చేశారని దిగ్విజయ్ సింగ్ గుర్తు చేసుకున్నారు.
రాజకీయాలు వేరు, మతాలు వేరు అనే విషయం అందరూ తెలుసుకోవాలని దిగ్విజయ్ సింగ్ ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. తరచూ బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై విమర్శలు గుప్పించే దిగ్విజయ్ సింగ్.. ఇప్పుడు ఒక్కసారిగా తనకు చేసిన సాయాన్ని గుర్తు చేసుకుని ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications