ఆంటీతో భేటీకి వస్తూ ఈ కారులో దినకరన్ ఎస్కేప్: బిజెపితో పన్నీర్ ఫార్ములా

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: బెంగళూరులోని పరప్పన జైలులో ఉన్న తన మేనత్త శశికళను కలిసేందుకు టిటివీ దినకర్ ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. పరిస్థితులు వివరించేందుకు ఆయన శశికళను కలవాలని అనుకున్నారు. కానీ పరిస్థితులు ఆయనకు ఎదురు తిరిగాయి.

శశికళను కలిసేందుకు ఆయన తన 7777 నెంబర్ గల కారులో బెంగళూరుకు బయలుదేరినట్లు తెలుస్తోంది. అయితే, ఆ సమాచారం ఢిల్లీ పోలీసులకు అందినట్లు తెలుస్తోంది. దాంతో తాను కారు దిగితే అరెస్టు అయ్యే అవకాశాలు ఉండడంతో శశికళను కలవకుండానే ఆయన వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

Dinakaran escapes in the middle without meeting Sasikala

ఇదిలావుంటే, శశికళ వర్గాన్ని మట్టి కరిపించేందుకు పన్నీరు సెల్వంకు బిజెపి నేతలకు మధ్య ఒప్పందం కుదిరినట్లు చెబుతున్నారు. పన్నీరు సెల్వంతో ఒప్పందానికి వచ్చి బిజెపి తమిళనాడు రాజకీయాల్లో చేయి పెట్టినట్లు చెబుతున్నారు.

తమిళనాడు తాజా రాజకీయాలన్నీ బిజెపి కనుసన్నల్లోనే జరుగుతున్న ప్రచారం సాగుతోంది. శశికళ వర్గంపై విజయం సాధిస్తే పన్నీర్ సెల్వం అన్నాడియంకెను బిజెపిలో విలీనం చేయాలనే ప్రతిపాదన వచ్చిందని చెబుతున్నారు. లేదంటే తమతో పొత్తు పెట్టుకుని తమకు సగం సీట్లు ఇవ్వాలని బిజెపి షరతు పెట్టినట్లు వినికిడి.

దాంతో ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గంతో చర్చలకు పన్నీరు సెల్వం వర్గం చర్చలకు ప్రాతిపదిక కూడా బిజెపితో కలిసి సాగే విషయంపై జరుగుతోందని అంటున్నారు. విలీనానికి పన్నీరు సెల్వం వర్గం అంగీకరించలేదని, కలిసి నడిచేందుకు మాత్రం సముఖంగా ఉందని అంటున్నారు. బిజెపి సూచనల మేరకే శశికళను, దినకరన్‌ను పక్కన పెట్టేందుకు రంగం సిద్ధమైనట్లు చెబుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that TTV Dinakaran has droped his idea to meet Sasikala in Parappana Agrahar jail in Benagaluru.
Please Wait while comments are loading...