రెబల్ ఎమ్మెల్యేలకు షాక్ మీద షాక్: ఖాళీ చెయ్యండి, లేదంటే తాళం వేసి సీల్ వెయ్యండి !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేలకు ఆ రాష్ట్ర శాసన సభ స్పీకర్ ధనపాల్ మరో షాక్ ఇచ్చారు. వెంటనే ఎమ్మెల్యేల క్వాటర్స్ (ఎమ్మెల్యేల హాస్టల్) ఖాళీ చేసి వెళ్లిపోవాలని, లేదంటే పరిస్థితి వేరుగా ఉంటుందని సోమవారం మద్యాహ్నం ఆదేశాలు జారీ చేసిన స్పీకర్ ధనపాల్ షాక్ మీద షాక్ ఇచ్చారు.

సీఎంకు మద్దతు: తమిళనాడు పోలీసు అధికారులు బెదిరిస్తున్నారు: కర్ణాటకలో ఎమ్మెల్యే కేసు !

స్పీకర్ ధనపాల్ అధికారికంగా సచివాలయం నుంచి 18 మంది రెబల్ ఎమ్మెల్యేలకు క్వాటర్స్ ఖాళీ చెయ్యాలని నోటీసులు జారీ చేశారు. గడవు లోపు క్వాటర్స్ ఖాళీ చెయ్యకుంటే అధికారులు వారి గదలకు తాళం వేసి సీల్ వెయ్యాలని స్పీకర్ ధనపాల్ కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Disqualified MLAs should leave MLA hostel immediately Speaker Dhanapal

ఇప్పటికే అనర్హత వేటు పడి విలవిలలాడుతున్న దినకరన్ గ్రూప్ లోని ఎమ్మెల్యేల నెత్తి మీద స్పీకర్ ధనపాల్ మరో బండరాయి వేశారు. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు ఇక మీద చెన్నై చేరుకుంటే వారు హోటల్స్ లో బస చెయ్యవలసి ఉంది.

షాక్: రెబల్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు: గవర్నర్ రాక ముందే దినకరన్ దిమ్మ తిరిగింది!

దినకరన్ ను నమ్ముకుని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తూ కొడుగు సమీపంలోని రిసార్ట్ లో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు కొందరు చిన్నగా అక్కడి నుంచి జారుకుని స్పీకర్ కాళ్లు పట్టుకోవడానికి సిద్దం అయ్యారని సమాచారం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Speaker Dhanapal orders ADMK MLAs who has been disqualified they should leave MLA hostel immediately. after MLAs vacating the hostel they they plan to seal their rooms.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X