వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డికే. రవి కేసు: మొబైల్ మెసేజ్‌లు పరిశీలిస్తున్న సీబీఐ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐఏఎస్ అధికారి డి.కే. రవి చివరి సారిగా తన స్నేహితురాలు, సాటి మహిళ ఐఏఎస్ అధికారికి వాట్సాప్ లో పంపించిన చివరి సందేశంలో ఏమి ఉందనే విషయాన్ని సీబీఐ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఆరా తీస్తున్నారు. మార్చి 15వ తేది, మార్చి 16వ తేదిన రవి సాటి మహిళ ఐఏఎస్ అధికారికి పంపించిన చివరి మెసేజ్ ను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు.

 DK Ravi death case: CBI to examine messages

రవి ఉపయోగించిన రెండు మొబైల్స్ సీబీఐ అధికారులకు అప్పగించడానికి సీఐడి అధికారులు సిద్దంగా ఉన్నారు. అదే విధంగా రవి మొబైల్‌ను పరిశీలించిన సైబర్ క్రైం పోలీసులు ఒక నివేదిక తయారు చేశారు. సీఐడి అధికారులు దర్యాప్తు చేసిన నివేదిక, సైబర్ పోలీసుల నివేదిక, విక్టోరియా ఆసుత్రి వైద్యులు ఇచ్చిన పోస్టుమార్టుం నివేదికను పరిశీలించిన తరువాత పూర్తి స్థాయి విచారణ చెయ్యాలని సీబీఐ అధికారులు భావిస్తున్నారు.

ఫోరెన్సిక్ నిపుణుల నుండి వచ్చే నివేదిక కేసు దర్యాప్తులో కీలకం కానుంది. రవి ఆత్మహత్య చేసుకొలేదని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు. అదే విధంగా ప్రతిపక్షాలు రవిది ఆత్మహత్య కాదని అంటున్నాయి. రవి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసినా అతను విధులలో ఎవరెవరితో గొడవపడ్డారనే విషయాలపై కూడా కూపీ లాగనున్నారు.

 DK Ravi death case: CBI to examine messages

రవిని ఎవరైనా బెదిరించారా, విధులు అడ్గుకొవడానికి ప్రయత్నించారా అని పూర్తి వివరాలు సేకరించడానికి సీబీఐ అధికారులు సిద్దమయ్యారు. కోలారులో పని చేసిన 14 నెలలు, ఆ తరువాత బెంగళూరు వాణిజ్య పన్నుల శాఖలో పని చేసిన సమయంలో రాజకీయ నాయకులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు తదితరులు ఎవరెవరు రవిని కలిశారనే వివరాలు సేకరించడానికి సీబీఐ అధికారులు సిద్దమయ్యారు.

English summary
CBI officers may examine DK Ravi's mobile messages said to be send to a lady IAS officers in Bengaluru of Karntaka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X