బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈడీ ముందుకు కాంగ్రెస్ ట్రబుల్ షూటర్..డీకే శివకుమార్ అరెస్టు

|
Google Oneindia TeluguNews

కర్నాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌కు ఈడీ కష్టాలు తప్పట్లేదు. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీకే శివకుమార్‌కు శుక్రవారం ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలంటూ గురువారం రాత్రి ఆయనకు సమన్లు అందాయి. దీంతో తనను అరెస్టు చేయరాదంటూ ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కర్నాటక హైకోర్టును ఆశ్రయించారు. అయితే శివకుమార్ కోరికను కోర్టు తోసిపుచ్చింది.

dk siva

అయితే కోర్టులను, చట్టాలను తాను గౌరవిస్తానని శివకుమార్ చెప్పారు. అయితే చట్టాలను న్యాయాన్ని గౌరవించే వ్యక్తిగా న్యాయపరమైన సూచనలు సలహాలు తీసుకునే వెసులుబాటు తనకుందని చెప్పారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఈడీ ముందుకు హాజరయ్యేందుకు ఢిల్లీకి వచ్చారు. అంతకుముందు శివకుమార్ బెంగళూరులో మాట్లాడారు. తన కుటుంబంతో కలిసి బయటకు వెళ్లి ఇంటికి గురువారం రాత్రి 9:30 గంటలకు ఇంటికి చేరుకున్నట్లు చెప్పారు. వెంటనే ఈడీ అధికారులు ఇంటికి వచ్చి నోటీసులు అందజేశారని చెప్పారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఢిల్లీకి రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారని శివకుమార్ వివరించారు.

తనకు కొన్ని వ్యక్తిగత పనులు గౌరీ పూజ ఉన్నందువల్ల మధ్యాహ్నం సమయానికి రాలేనని అధికారులకు తెలిపినట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే గతేడాది సెప్టెంబర్‌లో డీకే శివకుమార్‌తో పాటు మరికొందరు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. అదేసమయంలో కోట్ల రూపాయల్లో పన్నులు ఎగవేసినట్లు సమాచారం. కక్షపూరిత రాజకీయాలకు పాల్పడనని చెప్పిన సీఎం యడ్యూరప్ప చేస్తున్నదేమిటని శివకుమార్ ప్రశ్నించారు. తాను హత్యలు, లేదా మానభంగాలు చేయలేదని అలాంటప్పుడు ఎందుకు భయపడాలని ప్రశ్నించారు శివకుమార్. తను ఏ తప్పు చేయలేదన్న సంగతి తనకు తెలుసునని చెప్పారు. గత రెండేళ్లుగా తన తల్లిపై ఉన్న ఆస్తులన్నిటినీ అటాచ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు శివకుమార్.ఇప్పటికే విచారణ పేరుతో తమ రక్తాన్ని విచారణ సంస్థలు పీల్చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
Karnataka Congress's chief troubleshooter DK Shivakumar, appeared before the Enforcement Directorate in Delhi for being questioned in connection with a money-laundering case. The former minister faces arrest after his request for protection from arrest was rejected by the Karnataka High Court on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X