సీఎం పదవి అక్కడే డిసైడ్ చేస్తారు, నా మనసులో కోరిక అదే, సీఎం గురించి నాకు తెలీదు, డీకే క్లారిటి !

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ రెండున్నర ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతున్న సందర్బంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీనిపై ఇటీవల మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో దానిపై తన సీఎం సీటు ఆధారపడి ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. .

కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయంపై తన పదవి కొనసాగే విషయం ఆధారపడి ఉంటుందని, తాను అన్నింటికి సిద్దంగా ఉన్నానని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. కాంగ్రెస్ హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంటే తాను సీఎంగా ముందుకు కొనసాగుతానని, లేకుంటే హైకమాండ్ నిర్ణయానికే అనుగుణంగా తాను నడుచుకుంటానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు.

DK Shivakumar has once again made it clear that he aspires to become CM

లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య చేసిన ప్రకటన కలకలం రేపింది. సిద్దరామయ్య వ్యాఖ్యలతో డీకే శివకుమార్ వర్గీయులు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటనతో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోమవారం మీడియాతో మాట్లాడారు. తాను ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యక్తం చేశారు.

DK Shivakumar has once again made it clear that he aspires to become CM

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చేయాల్సిన పనులు, నిర్ణయాలు విషయంలో ఇప్పటికే డిసైడ్ చేశారని, అందులో ఎలాంటి మార్పులు ఉండవని నేను అనుకుంటున్నానని డీసీఎం డీకే శివకుమార్ అన్నారు. డీకే శివకుమార్ మాటలతో ఆయన ముఖ్యమంత్రి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలనే కోరికను ఆయన మరోసారి పరోక్షంగా వ్యక్తం చేశారు.

ఈ ఐదు సంవత్సరాలు కాకుండా వచ్చే ఐదేళ్ల కాలానికి కూడా తమ కాంగ్రెస్ ప్రభుత్వమే కర్ణాటకలో అధికారంలో ఉంటుందని, అందులో ఎలాంటి అనుమానం లేదని కేపీసీసీ అధ్యక్షుడు డీసీఎం డీకే శివకుమార్ అన్నారు. అయితే డీకే శివకుమార్ వ్యాఖ్యలతో సీఎం సిద్దరామయ్య వర్గీయుల్లో మళ్లీ గుబులు మొదలైయ్యింది. మరో పక్క లోక్ సభ ఎన్నికలు పూర్తి అయిన తరువాత కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని బీజేపీ, జేడీఎస్ పార్టీలకు చెందిన కొందరు నాయకులు జోస్యం చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+