దినకరన్ కు చెక్ పెట్టిన పన్నీర్, డీఎంకే: రూ. 28 కోట్ల ఫైన్ వివరాలు లేవని !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ. దినకరన్ నామినేషన్ ను తిరస్కరించాలని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గీయులు, డీఎంకే పార్టీ సీనియర్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి దినకరన్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే నామినేషన్ పత్రాల్లో ఆయన తప్పుడు సమాచారం ఇచ్చి ఎన్నికల కమిషన్ ను, ప్రజలను మోసం చెయ్యడానికి ప్రయత్నించారని పన్నీర్ సెల్వం వర్గీయులు, డీఎంకే పార్టీ నాయకులు అంటున్నారు.

DMK and OPS team argue to cancel the nomination filed by TTV Dinakaran.

విదేశాల నుంచి అక్రమంగా నగదు తన అకౌంట్ లో జమ చేసుకుని ప్రభుత్వాన్ని మోసం చేశారని, అందుకు దినకరన్ కు న్యాయస్థానం రూ. 28 కోట్ల అపరాధ రుసుం విధించిందని పన్నీర్ సెల్వం వర్గీయులు, డీఎంకే పార్టీ నాయకులు అంటున్నారు.

కోర్టు అపరాధ రుసుం విధించిన విషయం దినకరన్ తన నామినేషన్ పత్రాల్లో పొందుపరచలేదని, ఎన్నికల కమిషన్ నియమాలు ఉల్లంఘించారని వారు ఆరోపిస్తున్నారు. వెంటనే దినకరన్ నామినేషన్ ను తిరస్కరించాలని పన్నీర్ సెల్వం వర్గీయులు, డీఎంకే పార్టీ నాయకులు ఎన్నికల కమిషన్ కు మనవి చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
DMK and OPS team argue to cancel the nomination filed by TTV Dinakaran. Since he has not mentioned in nomination about Rs. 28 Cr fine amount imposed in Fera case.
Please Wait while comments are loading...