ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి భారత్ తో చేసిందిదే!
డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి భారత్ తో పక్కా వ్యాపారం చేస్తున్నారా? ప్రతీ విషయంలో భారత్ పై మోయలేని ఆర్ధిక భారాన్ని మోపుతున్నారా? తాజాగా గోల్డ్ కార్డ్ ప్రీమియం వీసా సిస్టం తీసుకురావటం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంద అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.
ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీయాలనే లక్ష్యం
అమెరికా-భారత్ సంబంధాలు డోనాల్డ్ ట్రంప్ పాలనా పగ్గాలు చేపట్టాక తీవ్రంగా మారిపోయాయి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా వచ్చినప్పటి నుండి ఈ సంబంధాల్లో వ్యాపార కోణం ఎక్కువగా కనిపిస్తుంది. భారత్ ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీయాలనే లక్ష్యం ప్రధానంగా ట్రంప్ నిర్ణయాలలో కనిపిస్తుంది.. అమెరికా అనుసరిస్తున్న "America First" విధానం కారణంగా భారత్‌తో ఉన్న సమీకరణం వ్యూహాత్మక భాగస్వామ్యం కంటే వాణిజ్య ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తుంది.

వీసా ఫీజుల పెంపులతో ట్రంప్ బిజినెస్
యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు ఆర్థిక లాభాలు, మార్కెట్ ఆధారిత నిర్ణయాలు చుట్టూ తిరుగుతున్నట్లు పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ దిశలో తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యమైనవి వీసా ఫీజుల పెంపులు. ఇటీవల అమెరికా ప్రభుత్వం పలు వీసాలపై భారీగా ఫీజులను పెంచింది. ఇప్పటికే టూరిస్ట్ వీసాల (B1/B2) ఫీజులు పెరగడం, నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాల ప్రాసెసింగ్ ఛార్జీలు పెరగడం భారత పర్యాటకులు మరియు ఉద్యోగులపై ప్రభావం చూపింది.
'గోల్డ్ కార్డ్' ప్రీమియం వీసా సిస్టమ్ కూడా బిజినెస్ మోడల్ లోనే
అంతేకాకుండా, కొత్తగా ప్రవేశపెట్టిన 'గోల్డ్ కార్డ్' ప్రీమియం వీసా సిస్టమ్ ద్వారా వేగవంతమైన ప్రాసెసింగ్ కోసం అదనపు అధిక ఫీజులు వసూలు చేస్తుండటం అమెరికా వీసా విధానాలు అన్నీ బిజినెస్ మోడల్‌గా మారుతున్నాయన్న అభిప్రాయాలకు కారణంగా మారింది. ఇప్పటికే విద్యార్థులకు F-1 స్టూడెంట్ వీసాల విషయంలో కఠినతర నిబంధనలు, అదనపు సెక్యూరిటీ చెక్‌లు, DS-160 ఫీజుల పెంపు భారంగా మారింది.
ఆర్ధిక ప్రయోజనాలే లక్ష్యంగా ట్రంప్ నిర్ణయాలు
భారత విద్యార్థులు అమెరికా ప్రధాన మార్కెట్‌గా ఉన్న నేపధ్యంలో ఈ నిర్ణయాలు పూర్తిగా ఆర్థిక ప్రయోజనం దృష్ట్యా తీసుకున్నవే అని నిపుణులు భావిస్తున్నారు. కేవలం భారతీయుల నుండి బిజినెస్ చెయ్యాలని, వారి నుండి ఎలా వీలైతే అలా ఆర్ధిక లావాదేవీలలో వసూలు చెయ్యాలని ట్రంప్ భావిస్తున్నారు. వాణిజ్య రంగంలో కూడా ట్రంప్ నుంచి ప్రారంభమైన ఒత్తిడి ఇంకా కొనసాగుతూనే ఉంది.
భారత్ తో బిజినెస్ ఫస్ట్ అన్నట్టు ట్రంప్ తీరు
స్టీల్, అల్యూమినియం దిగుమతులపై భారీ ట్యాక్స్ లు, భారత IT రంగంపై వీసా పరిమితులు, ట్రేడ్ డెఫిసిట్ తగ్గించాలనే ఒత్తిడి ఇవన్నీ అమెరికా భారత్‌ను ఒక పెద్ద బిజినెస్ మార్కెట్‌గా చూస్తోందని స్పష్టమవుతోంది. ఏది ఏమైనా మొత్తానికి, అమెరికా-భారత్ సంబంధాల్లో వ్యాపార ప్రయోజనాలు ముందువరుసలో నిలుస్తున్న పరిస్థితి, అమెరికా ఫస్ట్ అని ఫీల్ అవుతున్న ట్రంప్ భారత్ తో బిజినెస్ ఫస్ట్ అన్నట్టు తయారయ్యారని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
-
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
ట్రంప్ మాటలు నమ్మొద్దు.. యుద్ధం కొనసాగుతోంది: ఇరాన్ సంచలనం -
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
ఖమేనీ సంధి ఒప్పందం? -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్












Click it and Unblock the Notifications