Doute: లవ్ మ్యారేజ్, ఇంటి చుట్టూ కత్తితో తిరుగుతూ భార్యకు కాపలా, కొడవలితో నరికి స్పాట్ లో చంపేశాడు !
బెంగళూరు/రాయచూరు: యువతి, యువకుడి పరిచయం ప్రేమకు దారితీసింది. ప్రేమ వివాహం చేసుకున్న దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలం ఐటీ హబ్ దంపతులు కాపురం ఉన్నారు. భార్య మీద అనుమానం రావడంతో భర్త అతని సొంత ఊరుకు మకాం మార్చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మీద భర్తకు అనుమానం ఎక్కువ అయ్యింది. భార్య పదేపదే పుట్టింటికి వెళ్లి వస్తుంటే అక్కడే ఆమెకు ప్రియుడు ఉన్నాడని భర్తకు తెలిసింది. ఇదే విషయంలో దంపతులు తరచూ గొడవలు పడుతున్నారు. భార్య ఫోన్ లో వేరే వ్యక్తితో మాట్లాడుతోంది. భార్యను కంట్రోల్ లో పెట్టడానికి భర్త కత్తి చేతిలో పట్టుకుని ఇంటి చుట్టూ తిరుగుతూ భార్యను భయపెట్టాడు. భర్త టార్చర్ తట్టుకోలేక పుట్టింటికి వెళ్లిపోవాలని భార్య డిసైడ్ అయ్యాంది. ఏరోజు అయితే భార్య పుట్టింటికి పోవడానికి రెడీ అయ్యిందో అదే రోజు భర్త కొడవలి తీసుకుని ఆమెను వెనుక నుంచి నరికి స్పాట్ లో చంపేశాడు.

బెంగళూరులో పరిచయం
కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని లింగసనూరు తాలుకాలోని గడుదనాళ గ్రామానికి చెందిన చిట్టప్ప అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం బెంగళూరు చేరుకుని మేస్త్రీగా పని చేసేవాడు. కర్ణాటకలోని కలబురిగి జిల్లాలోని యడ్రామి తాలుకాలోని సుంబడ గ్రామానికి చెందిన రేణేకా బెంగళూరు చేరుకుని పని చేసేది. ఆ సందర్బంలో రేణుకా, చిట్టప్పకు పరిచయం అయ్యింది.

భార్య మీద అనుమానం
రేణుకా, చిట్టప్పల పరిచయం ప్రేమకు దారితీసింది. పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్న చిట్టప్ప, రేణుకా దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలం ఐటీ హబ్ బెంగళూరులో చిట్టప్ప, రేణుకా దంపతులు కాపురం ఉన్నారు. ఆ సందర్బంలో రేణుకా వేరే వ్యక్తితో ఎక్కువగా మాట్లాడుతోందని చిట్టపకు తెలిసింది.

బెంగళూరు ఖాళీ చేశాడు.....భర్త సొంతఊరిలో కాపురం
భార్య రేణుకా మీద అనుమానం రావడంతో చిట్టప్ప బెంగళూరు నుంచి మకాం మార్చేసి రాయచూరు జిల్లాలోని అతని సొంత ఊరుకు మకాం మార్చేశాడు. సొంత ఊరులో భార్య రేణుకా, ఇద్దరు పిల్లలతో కలిసి చిట్టప్ప నివాసం ఉంటున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య రేణుకా మీద ఆమె భర్త చిట్టప్పకు రానురాను ఇంకా అనుమానం ఎక్కువ అయ్యింది.

భార్యకు పుట్టింటి దగ్గర ప్రియుడు... కత్తితో భార్యకు భర్త కాపలా
భార్య రేణుకా పదేపదే కలబురిగి జిల్లాలోని పుట్టింటికి వెళ్లి వస్తుంటే అక్కడే ఆమెకు ప్రియుడు ఉన్నాడని చిట్టప్పకు తెలిసింది. ఇదే విషయంలో రేణుకా, చిట్టప్ప దంపతులు తరచూ గొడవలు పడుతున్నారు. రేణుకా ఫోన్ లో వేరే వ్యక్తితో మాట్లాడుతోంది. భార్య రేణుకాను కంట్రోల్ లో పెట్టడానికి చిట్టప్ప కత్తి చేతిలో పట్టుకుని ఇంటి చుట్టూ తిరుగుతూ భార్యను భయపెట్టడం మొదలు పెట్టాడు.

భార్యను వెనుక నుంచి నరికి స్పాట్ లో చంపేసిన భర్త
భర్త చిట్టప్ప టార్చర్ తట్టుకోలేక పుట్టింటికి వెళ్లిపోవాలని భార్య డిసైడ్ అయ్యాంది. రాత్రి తల్లికి ఫోన్ చేసిన రేణుకా రేపు నేను పిల్లలతో కలిసి ఊరికి వస్తున్నానని చెప్పింది. భార్య రేణుకా పుట్టింటికి పోవడానికి రెడీ అవుతోందని తెలుసుకున్న చిట్టప్ప రగిలిపోయాడు. ఉదయం ఇంటి బయట ఇంటి పని చేస్తున్న రేణుకాను కొడవలితో వెనుక నుంచి మూడుసార్లు నరికేశాడు.

ప్రేమించి పెళ్లి చేసుకుని చివరికి ఇలా చేశాడు
కొడవలి పోట్లు బలంగా పడటంతో గిలగిల తనకలాడిన రేణుకా స్పాట్ లో చనిపోయింది. భార్య రేణేుకాకను హత్య చేసిన చిట్టప్ప అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. భార్య రేణేకా మీద విపరీతమైన అనుమానం పెంచుకున్న చిట్టప్ప చివరికి ఆమెను స్పాట్ లో నరికి చంపేయడం రాయచూరులో కలకం రేపింది.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications