బ్రహ్మోస్ 2.O.. సూపర్ సక్సెస్: సైన్యం అమ్ములపొదిలో మరో అస్త్రం
భువనేశ్వర్: మనదేశ సైన్యం అమ్ముల పొదిలో మరో అత్యాధునిక ఆయుధం సమకూరింది. అదే బ్రహ్మోస్ క్షిపణి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు. డీఆర్డీఓ దీన్ని తయారు చేసింది. ఇప్పటిదాకా సైన్యం వద్ద ఉన్న బ్రహ్మోస్ క్షిపణులతో పోల్చుకుంటే దీనికి ఉన్న ప్రత్యేకతలు ఎక్కువే. ఒడిశాలో బాలాసోర్ జిల్లాలోని చండీపూర్ నుంచి సోమవారం ఉదయం దీన్ని ప్రయోగించారు. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది.
బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి రేంజ్ 290 కిలోమీటర్లు. 290 కిలోమీటర్ల పరిధిలో ఉపరితలం నుంచి ఉపరితలం మీద ఉన్న లక్ష్యాన్ని కొన్ని సెకెన్ల వ్యవధిలో ఛేదించగల నైపుణ్యం దీని సొంతం. భూమి ఉపరితలం మీది నుంచే కాకుండా.. సముద్రం మీది నుంచి సైతం ప్రయోగించడానికి అనువుగా ఈ క్షిపణిని డీఆర్డీఓ అధికారులు రూపొందించారు. ఈ క్షిపణి తయారీ కోసం రష్యా రక్షణ శాఖకు చెందిన ఎన్పీఓ మషినోస్ట్రోయేనియా సహకారాన్ని తీసుకున్నారు డీఆర్డీఓ అధికారులు. డీఆర్డీఓ, ఎన్పీఓఎం జాయింట్ వెంచర్ గా దీన్ని తయారు చేశాయి.

ఇప్పటిదాకా సైన్యం వద్ద గల బ్రహ్మోస్ క్షిపణుల్లో గరిష్ఠ రేంజ్ 450 కిలోమీటర్లు. ప్రస్తుతం ఇదే అత్యుత్తమ రేంజ్ గల క్షిపణి. అయినప్పటికీ.. ఇందులో కూడా లేని కొన్ని అత్యాధునిక సాకేంతిక వ్యవస్థను తాజాగా ప్రయోగించిన క్షిపణిలో అమర్చారు. ఒక్క ఆర్మీకి మాత్రమే కాకుండా, వైమానికం, నౌకాదళం కూడా దీన్ని వినియోగించుకునే వెసలుబాటు ఉంది. ఈ రకం క్షిపణి ప్రయోగం విజయవంతం కావడం వల్ల త్రివిధ దళాధినేతల్లో హర్షం వ్యక్తమౌతోంది.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications