Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Drug case: డ్రగ్స్ కేసు ఎఫ్ఐఆర్ లో ఫేమస్ యాంకర్ అను పేరు, డ్యాన్స్ మాస్టర్ దెబ్బతో, బ్రేక్ డ్యాన్స్ !

బెంగళూరు/ మంగళూరు/ చెన్నై: తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతదేశంలో డ్రగ్స్ కేసులకు సంబంధించి సీనీ తారలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. డ్రగ్స్ కేసులో హీరోయిన్లతో పాటు ఫేమస్ యాంకర్, డ్యాన్స్ మాస్టర్లు జైలుకు వెళ్లే పరిస్థితి ఎదురైయ్యింది. డ్రగ్స్ సేవించడమే కాకుండా డ్రగ్స్ సరఫరా చేస్తోందని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రముఖ యాంకర్ పేరును ఎఫ్ఐఆర్ లో నమోదు చెయ్యడం కలకలం రేపింది. ఇప్పటికే ఆ ఫేమస్ యాంకర్ ను ఒక్కసారి విచారణ చేసిన క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఇప్పుడు ఆమె మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారని సమాచారం. ప్రముఖ యాంకర్ డ్రగ్స్ సేవిస్తుందని, మేమే ఆమెకు డ్రగ్స్ ఇచ్చామని ఇప్పటికే ఇద్దరు డ్యాన్స్ మాస్టర్లు స్టేట్ మెంట్ ఇవ్వడంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు విచారణ చేసి పూర్తి సమాచారం సేకరించారు. ఇప్పుడు ఏకంగా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎఫ్ఐఆర్ లో యాంకర్ పేరు నమోదు చెయ్యడంతో ఆమెతో పాటు ఆమె అభిమానులు, ఆమె సన్నిహితులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని సమాచారం.

కలకలం రేపిన స్యాండిల్ వుడ్ డ్రగ్స్ కేసు

కలకలం రేపిన స్యాండిల్ వుడ్ డ్రగ్స్ కేసు

బెంగళూరు నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న వారి మీద బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పంజా విసిరారు. గత ఏడాదిలో డ్రగ్స్ కేసుకు సంబంధించి స్యాండిల్ వుడ్ స్టార్ హీరోయిన్లు రాగిణి దివ్వేది, సంజనాలు అరెస్టు అయ్యి జైలు పాలై తరువాత బెయిల్ మీద బయకు వచ్చారు. బెంగళూరు తరువాత మంగళూరులో కూడా డ్రగ్స్ దందా వెలుగు చూసింది.

డ్యాన్స్ మాస్టర్లు అరెస్టు

డ్యాన్స్ మాస్టర్లు అరెస్టు

డ్రగ్స్ కేసుకు సంబంధించి మంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు డ్యాన్స్ మాస్టర్లు కిశోర్, తరుణ్ ను అరెస్టు చేశారు. మంగళూరు పోలీసుల విచారణలో అనేక మంది పేర్లు తెరమీదకు వచ్చాయి. భారతదేశంలో మైకెల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, సినిమా దర్శకుడు ప్రభుదేవాతో కలిసి డ్యాన్స్ మాస్టర్ కిశోర్ కలిసి నటించాడు. బాలీవుడ్ సినిమా ఏబీసీడీలో ప్రభుదేవాతో పాటు నటించిన కిశోర్ పలు సినిమాలకు డ్యాన్స్ మాస్టర్ గా పని చెయ్యడమే కాకుండా సొంతంగా డ్యాన్స్ స్కూల్స్ నిర్వహిస్తున్నాడు.

తెరమీదకు యాంకర్ అనూశ్రీ

తెరమీదకు యాంకర్ అనూశ్రీ

2007-08 రియాల్టీ షోకు సంబంధించి ప్రముఖ కన్నడ నటి, టీవీ యాంకర్ అనూశ్రీకి తాము డ్యాన్స్ నేర్పించామని, తరువాత డ్రగ్స్ సరఫరా చేశామని డ్యాన్స్ మాస్టర్లు తరుణ్, కిశోర్ అప్పట్లో పోలీసుల విచారణలో అంగీకరించారని తెలిసింది. ఇదే విషయంలో యాంకర్ అనూశ్రీని మంగళూరు పోలీసులు అప్పట్లోనే విచారణ చేసి ఆమె స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్నారు.

ఎఫ్ఐఆర్ లో అనూశ్రీ పేరు ఎలా వచ్చిందంటే ?

ఎఫ్ఐఆర్ లో అనూశ్రీ పేరు ఎలా వచ్చిందంటే ?

డ్రగ్స్ కేసు విచారణలో నిందితులు చెప్పిన వివరాల ఆధారంగా కన్నడ ఫేమస్ యాంకర్ అనూశ్రీ పేరు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారని సమాచారం. అనూశ్రీ డ్రగ్స్ సేవించడమే కాకుండా ఆమె డ్రగ్స్ కూడా సరఫరా చేస్తున్నారని విచారణలో తమకు తెలిసిందని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు. ఇప్పటికే ఒకసారి విచారణ ఎదుర్కొన్న యాంకర్ అనూశ్రీకి ఇప్పుడు డ్రగ్స్ కేసులో సినిమా కష్టాలు ఎదురౌతున్నాయని తెలిసింది.

రూమ్ లో అనూశ్రీ ఏం చేసిందంటే ?

రూమ్ లో అనూశ్రీ ఏం చేసిందంటే ?

డ్రగ్స్ ను రూమ్ తీసుకు వస్తున్న అనూశ్రీతో కలిసి మేము గతంలో డ్రగ్స్ సేవించామని డ్యాన్స్ మాస్టర్లు కిశోర్, అరుణ్ అంగీకరించారని, అందువలనే ఆమె పేరు ఎఫ్ఐఆర్ లో చేరిపోయిందని కన్నడ మీడియా అంటోంది. గతంలో ఒక్కసారి అనూశ్రీని విచారణ చేసిన పోలీసులు తరువాత ఆమెను విచారణకు పిలవలేదు.

రాజకీయ నాయకుల ఒత్తిడి ?

రాజకీయ నాయకుల ఒత్తిడి ?

డ్రగ్స్ కేసుకు సంబంధించి అనూశ్రీ పేరు తొలగించాలని కొందరు పోలీసు అధికారుల మీద కొందరు ప్రభావమంతమైన నాయకులు చాలా ఒత్తిడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే రాజకీయ నాయకుల ఒత్తిడికి తలవంచకుండా యాంకర్ అనూశ్రీ విషయంలో పోలీసు అధికారులు వారిపని వారు చేశారని సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+