బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Drug mafia:బాలీవుడ్ స్టార్స్ పేర్లు చెప్పాలని NCB టార్చర్ ?కాపాడండి సార్, కోర్టులో క్షితిజ్,ఎవరంటే ?

|
Google Oneindia TeluguNews

ముంబాయి/ న్యూఢిల్లీ/ బెంగళూరు: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (SSR) అనుమానాస్పద మృతి కేసు తరువాత బాలీవుడ్ డ్రగ్స్ కేసు మాఫియా వెలుగులోకి రావడంతో అన్ని కేసులు రసవత్తరంగా మారాయి. బాలీవుడ్ డ్రగ్స్ కర్మకాండ అనేక మంది ప్రముఖ హీరోలు, హీరోయిన్ల మెడకు చుట్టుకుంటోంది. ఇప్పటికే రియా చక్రవర్తితో సహ అనేక మంది అరెస్టు అయ్యి జైలుపాలైనారు. దీపికా పదుకొనే, శ్రద్ధాకపూర్, సారా ఆలీఖాన్ తదితరులను ఎన్ సీబీ అధికారులు విచారణ చేశారు. ప్రముఖ హీరోల పేర్లు చెప్పాలని NCB అధికారులు తనకు టార్చర్ పెడుతున్నారని, వాళ్ల పేర్లు చెప్పడానికి తాను సిద్దంగా లేనని బాలీవుడ్ ప్రముఖుడు క్షితిజ్ ప్రసాద్ కోర్టును ఆశ్రయించడం ఇప్పుడు బాలీవుడ్ లో కలకలం రేపింది. ఎన్ సీబీ అధికారులు డ్రగ్స్ కేసుతో లింక్ ఉందని చెప్పమని ఒత్డిడి చేసిన వారి పేర్లు క్షితిజ్ ప్రసాద్ చెప్పడంతో ఆ ప్రముఖులు హడలిపోతున్నారు.

Khiladi wife: కొవ్వు కరిగించాలని భార్య జిమ్ కు, జిమ్ మాస్టర్ కు ఫ్రూట్ జ్యూస్, భర్తకు ఖాళీ గ్లాస్!Khiladi wife: కొవ్వు కరిగించాలని భార్య జిమ్ కు, జిమ్ మాస్టర్ కు ఫ్రూట్ జ్యూస్, భర్తకు ఖాళీ గ్లాస్!

 డ్రగ్స్ కేసులో క్షితిజ్ అరెస్ట్

డ్రగ్స్ కేసులో క్షితిజ్ అరెస్ట్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (SSR)అనుమానాస్పద మృతి కేసు తరువాత బాలీవుడ్ డ్రగ్స్ కేసు మాఫియా వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ డ్రగ్స్ కేసును NCB అధికారులు విచారణ చేస్తున్నారు. ఇదే కేసులో బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మా ప్రోడక్షన్ కు అనుబంధ సంస్థకు చెందిన క్షితిజ్ ప్రసాద్ ను ఎన్ సీబీ అధికారులు అరెస్టు చేశారు. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో క్షితిజ్ ప్రసాద్ ను అధికారులు విచారణ చేసి సమాచారం సేకరించారని తెలిసింది.

 రణబీర్ కపూర్ టార్గెట్ ?

రణబీర్ కపూర్ టార్గెట్ ?

బాలీవుడ్ డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయిన ధర్మా ప్రోడక్షన్ కు చెందిన క్షితిజ్ ప్రసాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బాలీవుడ్ డ్రగ్స్ మాఫియాతో ప్రముఖ హీరో రణబీర్ కపూర్ కు సంబంధాలు ఉన్నాయని తనను అంగీకరించమని ఎన్ సీబీ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని, తనను టార్చర్ చేసినా ఆ హీరో పేరు తాను చెప్పలేదని ఆరోపిస్తూ క్షితిజ్ ప్రసాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

 ఈ హీరోల పేర్లు చెప్పాలంట !

ఈ హీరోల పేర్లు చెప్పాలంట !

బాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎన్ సీబీ అధికారులు తనను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని క్షితిజ్ ప్రసాద్ కోర్టులో ఆరోపిస్తున్నాడు. బాలీవుడ్ ప్రముఖ హీరోలు రణబీర్ కపూర్, అర్జున్ రామ్ పాల్, డినో మారియోల పేర్లు డ్రగ్స్ కేసులో ఇరికించడానికి ఎన్ సీబీ అధికారులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని, వారి పేర్లు తననోటితో చెప్పించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ క్షితిజ్ ప్రసాద్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాడు.

 నాకు చిత్రహింసలు పెట్టారు మహాప్రభో !

నాకు చిత్రహింసలు పెట్టారు మహాప్రభో !

డ్రగ్స్ కేసుకు సంబంధించి తనను అదుపులోకి తీసుకున్న ఎన్ సీబీ అధికారులు మానసికంగా, శారీరకంగా తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారని ,ఆ అధికారుల నుంచి తనను కాపాడాలని క్షితిజ్ ప్రసాద్ న్యాయస్థానంలో పీఎల్ ఏ దాఖలు చేశాడు. డ్రగ్స్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తనకు న్యాయం చెయ్యాలని క్షితిజ్ ప్రసాద్ కోర్టును ఆశ్రయించాడు.

 నేనేం చెప్పలేదు, అయినా కథలో మలుపులు !

నేనేం చెప్పలేదు, అయినా కథలో మలుపులు !

డ్రగ్స్ కేసు విచారణలో తాను చెప్పని విషయాలను కూడా తాను చెప్పినట్లు ఎన్ సీబీ అధికారులు రికార్డు చేసుకున్నారని, తాను చెప్పిన విషయాలను రివర్స్ లో వారికివారే రాసుకుని వాటిని కోర్టులో సమర్పించి తనను ఇరికించాలని ప్రయత్నిస్తున్నారని, తాను చెప్పినట్లు ఎన్ సీబీ అధికారులు కోర్టుకు సమర్పించిన పూర్తి సమాచారంలో ఎలాంటి నిజం లేదని ఆరోపిస్తూ క్షితిజ్ ప్రసాద్ కోర్టులో రివర్స్ అఫిడవిట్ దాఖలు చేశాడు.

Recommended Video

COVID-19 సహా వైరల్ ఇన్ఫెక్షన్లను చంపడానికి APT™ T3X Ointment తో కరోనా వైరస్ కు చెక్ ! || Oneindia
 క్షితిజ్ ఏం చేశాడో తెలుసా !

క్షితిజ్ ఏం చేశాడో తెలుసా !

బాలీవుడ్ నటీ నటులకు డగ్స్ ను సరఫరా చేశాడని, డ్రగ్స్ దందాతో లింక్ పెట్టుకున్నాడని ఆరోపిస్తూ ఎన్ సీబీ అధికారులు ధర్మా ప్రోడక్షన్ కు చెందిన క్షితిజ్ ప్రసాద్ ను అరెస్టు చేశారు. ఇదే కేసులో క్షితిజ్ ప్రసాద్ తో పాటు మరో నిందితుడు అంకుశ్ ను ఎన్ సీబీ అధికారులు అరెస్టు చేశారు. క్షితిజ్ ప్రసాద్ డ్రగ్స్ తో పాటు గంజాయిని విక్రయించాడని తమ విచారణలో వెలుగు చూసిందని ఎన్ సీబీ అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే ఎన్ సీబీ అధికారులపై రివర్స్ పంచ్ తో క్షితిజ్ ప్రసాద్ కోర్టులో ఫిటిషన్ దాఖలు చెయ్యడంతో ఈ కేసు అనేక కొత్త మలుపులు తిరుగుతోంది.

English summary
Drug mafia: Drug case accused Kshitij Prasad alleged that NCB officials forced him to say Ranbeer Kapoor, Arjun Rampal and Dino Mario names in drug case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X