Drugs racket: బెంగళూరులో నటి అరెస్టు, ముంబాయి భర్త దెబ్బ, హీరో సుశాంత్ కేసుతో రచ్చ, ఆంధ్రా !

బెంగళూరు/ ముంబాయి: బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ సింగ్ ఆత్మహత్య కేసుతో అనేక కేసులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఐటీ బీటీ సంస్థల దేశ రాజధాని బెంగళూరులో కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఎన్ సీబీ (NCB) అధికారులు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఇప్పటికే కన్నడ నటిని అరెస్టు చేసిన అధికారులు స్యాండిల్ వుడ్ లోని నటీనటులతో పాటు చిత్రపరిశ్రమకు చెందిన వారిలో ఎవరికైనా లింక్ లు ఉన్నాయా ? అనే కోణంలో విచారణ ముమ్మరం చేశారు. చిన్నపిల్లలు ఆడుకునే బోమ్మలు, చపాతి టిఫిన్ బాక్స్ ల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. ముంబాయిలో ఇటీవల డ్రగ్స్ సరఫరా కేసులో అరెస్టు అయిన కె. రెమమాన్ కు, బెంగళూరులో అరెస్టు అయిన నటికి లింక్ ఉందని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

 బెంగళూరు అడ్డా !

బెంగళూరు అడ్డా !

ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని సిలికాన్ సిటీ బెంగళూరును అడ్డగా చేసుకుని కర్ణాటకలోని మంగళూరు, మైసూరు, బెళగావి తదితర ప్రముఖ నగరాలకు డ్రగ్స్, 96 ఎండీఎంఎ మాత్రలు సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తూ ముగ్గురిని బెంగళూరులో అరెస్టు చేశారు. బెంగళూరు నగరంలోని మూడు ప్రాంతాల్లో సోదాలు చేసిన పోలీసులు భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకుని విచారణ ముమ్మరం చేశారు.

 నటి అనికా అరెస్టు

నటి అనికా అరెస్టు

పాపులర్ అయిన అనేక టీవీ సీరియల్స్ లో నటించిన డి. అనికా అనే మహిళ బెంగళూరులో డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులు, ఎన్ సీబీ అధికారులకు అడ్డంగా చిక్కిపోయింది. నటి అనికాతో పాటు మోహ్మద్ అనూఫ్, ఆర్. రవిచంద్రన్ అనే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని దొడ్డగుబ్బిలో నివాసం ఉంటున్న నటి అనికా ఇంటిలో సోదాలు చేసిన పోలీసులు భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నటి అనికాను అరెస్టు చేసిన విషయాన్ని NCB డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్ర దృవీకరించారు.

 ముంబాయి రెహమాన్ భార్య నటి అనికా ?

ముంబాయి రెహమాన్ భార్య నటి అనికా ?

ఇటీవల ముంబాయిలో అరెస్టు అయిన డ్రగ్స్ కింగ్ పిన్ కె. రెహమాన్ కు, బెంగళూరులో అరెస్టు అయిన నటి అనికాకు లింక్ ఉందని పోలీసుల విచారణలో వలుగు చూసింది. ముంబాయికి చెందిన డ్రగ్స్ కింగ్ పిన్ రెహమాన్ ను నటి అనికా పెళ్లి చేసుకుందని పోలీసులు అంటున్నారు. అనికాను అడ్డం పెట్టుకుని రెహమాన్ బెంగళూరులోని పలు కాలేజ్ విద్యార్థులు, డ్రగ్స్ కు బానిసలు అయిన వీఐపీలకు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కొన్ని సంవత్సరాల నుంచి రెహమాన్, నటి అనికా దంపతులు డ్రగ్స్ దందా చేస్తున్నారని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

 ఆంధ్రా టూ బెంగళూరు కంటేనర్

ఆంధ్రా టూ బెంగళూరు కంటేనర్

ఆంధ్రప్రదేశ్ నుంచి ఓ కంటేనర్ బెంగళూరు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి కంటేనర్ లో డ్రగ్స్ బెంగళూరు తీసుకు వచ్చారని అధికారులకు సమాచారం అందడంతో పక్కాప్లాన్ ప్రకారం పోలీసులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కంటేనర్ లో రూ. 1 కోటికి పైగా విలువైన 204 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న అధికారులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

 కల్యాణనగర్ హోటల్ లో డీల్

కల్యాణనగర్ హోటల్ లో డీల్

బెంగళూరు నగరంలోని కల్యాణనగర్ లోని రాయల్ సూట్ హోటల్ అపార్ట్ మెంట్ లో డ్రగ్స్ డీల్ జరుగుతోందని సమాచారం అందడంతో ఆగస్టు 21వ తేదీన పోలీసులు దాడులు చేసి నటి అనికాను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో హోటల్ లో 2.20 లక్షల రూపాయల నగదుతో పాటు 145 ఎండీఎంఎ మాత్రలు (డ్రగ్స్)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవనహళ్ళి (బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ప్రాంతం)లోని కొందరికి వీరు డ్రగ్స్ సరఫరా చెయ్యడానికి ప్రయత్నించారని అధికారుల విచారనలో వెలుగు చూసింది.

Recommended Video

    COVID-19 సహా వైరల్ ఇన్ఫెక్షన్లను చంపడానికి APT™ T3X Ointment తో కరోనా వైరస్ కు చెక్ ! || Oneindia
    స్యాండిల్ వుడ్, వీఐపీలకు లింక్ ?

    స్యాండిల్ వుడ్, వీఐపీలకు లింక్ ?

    స్యాండిల్ వుడ్ లోని కొందరు నటీ నటులు, సంగీత దర్శకులతో పరిచయం పెంచుకున్న టీవీ సీరియల్ నటి అనికా వారి సహకారంతో డ్రగ్స్ సరఫరా చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. అయితే స్యాండిల్ వుడ్ కు, డ్రగ్స్ కు లింక్ పెట్టడం సరికాదని కొందరు నటీనటులు మండిపడుతున్నారు. నటి అనికాతో ఎవరెవరికి లింక్ లు ఉన్నాయి, ఎక్కడెక్కడ వీరు డ్రగ్స్ సరఫరా చేశారు, ఎంత మంది ఈ దందాలో ఉన్నారు ? అనే కోణంలో ఎన్ సీబీ అధికారులు, బెంగళూరు సీసీబీ పోలీసులు కూపీలాగుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+