Wife: ఇది నాకాలే. అది నాకాలే, పుష్పా డైలాగ్ చెప్పాడు, పెళ్లామ్ కొడితే మామూలుగా ఉండదు బిడ్డ, ఏం చేశాడు !

చెన్నై/ నమ్మక్కల్: ఇంట్లో దంపతుల మద్య సరసాలు, సల్లాపాలు ఎక్కువగా ఉంటాయి. అదే రైంజ్ లో గొడవలు ఉంటాయి. దంపతులు అన్యోన్యంగా ఉన్నా వారి సంతోషానికి అడ్డుఅదపు ఉండదు. అదే దంపతుల మద్య గొడవలు జరిగితే ఇంటి టాప్ లేచిపోతుంది. భారతదేశంతో పాటు ప్రపంచంలో ఎక్కడైనా దంపతుల మద్య గొడవలు జరగడం సర్వసాధారణం. ఇలాంటి ఫ్యామిలీ గొడవల తరువాత దంపతులు మళ్లీ కలిసిపోవడం సర్వసాదారణం. ఇలాంటి గొడవలతో దంపతులు కొందరు విడిపోవడం మనం నిత్యం చూస్తూనే ఉంటాము. అయితే ఇంటికి వెళ్లిన భర్త అతని భార్యతో మాట్లాడాలని అనుకున్నాడు. పరిస్థితులు అనుకూలించకపోవడంతో భర్త ఇంటి బయట నుంచి అటే బయలుదేరి వీధిలోకి వెళ్లాడు. అక్కడ 108 కు ఫోన్ చేసిన భర్త ఓ విషయం చెప్పాడు. తరువాత అసలు కథ మొదలైయ్యింది.

కొన్ని సంవత్సరాలు హ్యాపీ

కొన్ని సంవత్సరాలు హ్యాపీ

తమిళనాడులోని నమ్మక్కల్ జిల్లాలోని చిట్కో కాలనీలో మురగేషన్ (55) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. మురుగేశన్ 25 సంవత్సరాల క్రితం సెల్వీ (పేరు మార్చడం జరిగింది) అనే మహిళను వివాహం చేసుకున్నాడు, మురగేషన్, సెల్వీ దంపతుల పిల్లలు వివాహాలు చేసుకుని ఎవరిపాటికి వారు వేర్వేరుగా కాపురాలు ఉంటున్నారు.

హలో 108.... వెంటనే వచ్చేయండి సార్

హలో 108.... వెంటనే వచ్చేయండి సార్

మురగేషన్ కు విపరీతంగా మద్యం సేవించే అలవాటు ఉంది. మద్యం మత్తులోనే మురగేష్ రోజు ఇంటికి వెలుతున్నాడు. తాను రోడ్డు ప్రమాదంలో పడి తీవ్రగాయాలైనాయని, మీరు వెంటనే వచ్చి నన్ను రక్షించాలని మురగేషన్ అతని మొబైల్ ఫోన్ తో ఫోన్ చేసి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించాడు. దీని ప్రకారం నమక్కల్ - తిరుచ్చి మార్గం మద్యలో సంచరిస్తున్న 108 అంబులెన్స్ సిబ్బంది పరుగు తీసి సంఘటనా స్థలానికి వెళ్లారు.

కాలు మీద కాలు వేసుకుని బీడి తాగుతూ ఎంజాయ్

కాలు మీద కాలు వేసుకుని బీడి తాగుతూ ఎంజాయ్

108 సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా మద్యం మత్తులో ఊగుతున్న మురగేషన్ కాలు మీద కాలు వేసుకుని బీడీ తాగుతున్న విషయం గుర్తించి షాక్ అయ్యారు. ఎలాంటి గాయాలు లేకుండా మురగేష్ హ్యీపీగా ఉన్నాడని 108 సిబ్బంది గమనించారు. ఆ సందర్బంలో 108 సిబ్బంది సహనం కోల్పోయి మురగేషన్ కు చివాట్లు పెట్టారు.

పెళ్లామ్ కొడితే మామూలుగా ఉండదు

పెళ్లామ్ కొడితే మామూలుగా ఉండదు

మురగేష్ తీరుతో 108 సిబ్బంది విసిగిపోయారు. అక్కడే ఉన్న స్థానికులు మురగేషన్ భార్యకు మాచారం ఇచ్చారు. మరగేషన్ భార్య సెల్వీ అక్కడికి వెళ్లి పీకలదాక మద్యం తాగేసి 108 అంబులెన్స్‌కి ఎందుకు ఫోన్ చేసావు. వారు ప్రాణదాతలు ఎంతో మందికి సేవ చేయ్యడానికి వెళుతున్నప్పుడు మద్యం సేవించి, మద్యం మత్తులో కాలక్షేపం కోసం వాళ్లకు ఫోన్ చేస్తావా అంటూ సెల్వీ ఆమె భర్త మురగేషన్ ను చితకబాదేసింది. మురుగేశన్ అతని భార్య కొట్టిన దెబ్బలు తట్టుకోలేక మళ్లీ మద్యం సేవించడానికి బైక్ లో అక్కడి నుంచి పరారైనాడు. లిక్కర్ షాపు దగ్గర మద్యం సేవిస్తున్న మురగేషన్ ను మళ్లీ అక్కడ అతని భార్య చితకబాదడం ఆ ప్రాంతంలో హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+