Viral video:మత్తులో జోగిన అధికారి.. లేడీ పోలీస్‌పై జులుం.. ఎక్కడ అంటే

మద్యం సేవిస్తే ఇక అంతే.. అవును ఎవరూ ఎవరి మాట వినరు. తాగితే చిన్న, చితక అయితే పోలీసులు లాఠీ ఝులిపిస్తారు. అదే అధికారులు, రాజకీయ నేతలు అయితే.. సలాం చేస్తారు. ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటన జరిగింది. ఓ అధికారి మత్తులో జోగింది. సదరు అధికారి లేడీ కావడం విశేషం. ఆమెను పోలీసులు ఏమీ అనలేదు.. కానీ ఆమె రెచ్చిపోయింది. నానా హంగామా చేసింది. వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతుంది.

బహ్రైచ్‌లో ఈ ఘటన జరిగింది. అక్కడ రచన కెశర్వానీ అనే డిప్యూటీ లేబర్ కమిషనర్ పోలీసులకు కనిపించారు. దేవిపట్టణం తాలుకాలో ఆమె పనిచేస్తారు. ఆ వీడియోలో పోలీసులు ఆమెను కూల్ చేయడానికి నానా తంటాలు పడ్డారు. ఓ లేడీ కాప్ కష్టాలు వర్ణణాతీతం. ఆమెను కారులో ఎక్కించడానికి తల ప్రాణాలు తోకకు వచ్చాయి. అయినప్పటికీ తిరిగి కారు దిగారు. అక్కడ పోలీసులు చేష్టలుడిగి కనిపించారు.

Drunken woman officer creates ruckus in UP

ఒకానొక సందర్భంలో పోలీసునే మత్తులో జోగుతున్న అధికారి బెదిరించారు. అయినప్పటికీ పోలీసు అధికారి.. కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఘటన పెను దుమారం రేపింది. దీంతో కార్మికశాఖ స్పందించింది. ఘటనపై విచారణకు ఆదేశించింది. కలకలం రేగడంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. విచారణ నివేదికను బట్టి చర్యలు తీసుకోనుంది.

నిజానికి రచన పోలీసులతో తప్పుగా ప్రవర్తించింది. అధికార దర్పం ప్రదర్శించింది. తనను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమా ఆమెలో కనిపించింది. కారులో కూర్చొబెట్టినా దిగడం.. ఆ మహిళ పోలీసుతో వాదనకు దిగడం చూస్తుంటే.. ఆమె బిహెవ్ అలానే అనిపించింది. కానీ ఇదీ సరికాదని నెటిజన్లు అంటున్నారు. అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+