విదేశాల నుండి ట్యాక్స్ లేకుండా మనం బంగారం ఎంత తెచ్చుకోవచ్చో తెలుసా!

బంగారం ధర విపరీతంగా పెరిగి, మళ్లీ ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతున్న వేళ విదేశాల నుంచి మనం బంగారాన్ని ఎంత తెచ్చుకోవచ్చు. విదేశాల నుంచి బంగారు ఆభరణాలు తెచ్చుకోవడానికి కస్టమ్స్ మినహాయింపులు ఏ విధంగా ఇస్తుంది? 2026 బ్యాగేజీ నిబంధనల ద్వారా కేంద్రప్రభుత్వం కస్టమ్స్ మినహాయింపులను పెంచింది. దీని ప్రకారం మనం విదేశాల నుంచి బంగారు ఆభరణాలను తెచ్చుకోవడానికి నిబంధనలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

సుంకం లేకుండా బంగారం ఎంత తెచ్చుకోవచ్చు అంటే

కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు సోమవారం ప్రకటించిన బ్యాగేజీ నిబంధనలు 2026 ప్రకారం మహిళా ప్రయాణికులు 40గ్రాముల బంగారు ఆభరణాలను, పురుషులు 20గ్రాముల బంగారు ఆభరణాలను సుంకం లేకుండా తెచ్చుకోవచ్చు. గతంలో ఈ పరిమితి విలువ ఆధారంగా మహిళకు లక్ష రూపాయలు, పురుషులకు 50వేల రూపాయలుగా ఉండేది. ఇక ఈ వెసులుబాటు ఏడాదికిపైగా విదేశాలలో నివసించి తిరిగి వచ్చే వారికి, భారత సంతతికి చెందిన పర్యాటకులను ఉద్దేశించబడింది.

duty free gold jewellery Do you know how much gold we can bring from abroad without paying tax

వ్యక్తిగత వినియోగ ఆభరణాలకు మాత్రమే వర్తించేలా నిబంధనలు

ఇది వ్యక్తిగత వినియోగ ఆభరణాలకు మాత్రమే వర్తిస్తుంది. బంగారు బిస్కెట్లు, కడ్డీలు వంటివి తెచ్చుకోవడానికి మాత్రం ఇది అస్సలు వర్తించదు. తాజాగా బ్యాగేజీ నిబంధనలు 2026 ప్రకారం విమానాల ద్వారా కానీ సముద్ర మార్గంలో కానీ భారతదేశానికి వచ్చేవారు పర్యాటక వీసా కాకుండా ఇతర వీసాలపై వచ్చే విదేశీయులు 75 వేల రూపాయల విలువైన వస్తువులను సుంకం లేకుండా తెచ్చుకోవచ్చు.

గతం కంటే పెరిగిన పరిమితి

గతంలో 50 వేలుగా ఉన్న ఈ పరిమితి ఇప్పుడు 75 వేలకు పెరిగింది. ఇక విదేశీ పర్యాటకులు అయితే 25వేల రూపాయల విలువైన కొత్త వస్తువులను సుంకం లేకుండా తెచ్చుకోవచ్చు. 18 సంవత్సరాల పైబడిన ప్రయాణికులు ఒక కొత్త లాప్టాప్ ను లేదా నోట్ పాడ్ ను సుంకం లేకుండా తెచ్చుకోవచ్చు.

2016 నిబంధనల స్థానంలో కొత్త బ్యాగేజ్ నిబంధనలు

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ కస్టమ్స్ మినహాయింపులు, కొత్త నిబంధనలు పాత 2016 నిబంధనల స్థానంలో వచ్చాయి. ఇవి ఫిబ్రవరి 2వ తేదీ నుంచి అమలవుతున్నాయి. ఈ నిబంధనల ప్రకారం ఇండియాకు వచ్చే వివిధ వర్గాల వీసాదారులకు ఒక్కో విధంగా బ్యాగేజీ పై కస్టమ్స్ ట్యాక్స్ మినహాయింపులు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+