• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విదేశాల్లోని తెలుగువారికి గుడ్ న్యూస్: తెలుగింటి స్వీట్స్‌ను డోర్ డెలివరీ చేస్తున్న నేటివ్ స్పెషల్

అమ్మ ఆవకాయ ఎప్పుడూ బోర్ కొట్టవు. ఒక్క ఆవకాయే కాదు అమ్మ చేతి వంట ఏదీ బోర్ కొట్టదు. సాధారణంగా విదేశాలకు ఉద్యోగాలపై ఇతర బిజినెస్ ట్రిప్స్ పై వెళ్లే మనవాళ్లు అమ్మ తయారు చేసిన పచ్చళ్లు, మిఠాయిలు, చిరుతిళ్లు తమతో తీసుకెళుతుంటారు. అది ఒక్కసారి అయిపోతే మళ్లీ అలాంటి రుచి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంతలా ఇంటి తిండి కోసం మొహం వాచిపోయి ఉంటుంది. ఇక విదేశాల్లో ఉంటున్నవారికి ఆ బాదక్కర్లేదు. ఎందుకంటే మీకోసం తెలుగు రాష్ట్రాల రుచులు నేరుగా మీ ఇంటి తలపు వద్దకు వచ్చే ఏర్పాటు చేస్తోంది నేటివ్ స్పెషల్.

ఇక పండగ సీజన్లు అంటే దీపావళి, సంక్రాంతి సమయంలో అమ్మ, అమ్మమ్మ,నాణమ్మలు కొన్ని ప్రత్యేక మిఠాయిలు తయారు చేస్తారు. మురుకులు, అరిసెలు అలాంటివి. ఇవి మనకు కచ్చితంగా గుర్తు ఉండే ఉంటాయి. గత రెండు దశాబ్దాలుగా మన జీవనశైలిలో మార్పులు వచ్చాయి. మంచి ఉద్యోగాలు రావడంతో పెద్ద నగరాలకు వెళ్లిపోవడం జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో అమెరికా, యూకే, ఐరోపా లాంటి దేశాలకు పై చదువుల కోసమో లేక ఉద్యోగం చేసేందుకో వెళుతున్నారు. ఆ సమయంలో వారు ఇంటి రుచులు కోల్పోతున్నారు.

E-Commerce site Native special offers Home made sweets to the people residing abroad

విదేశాల్లో ఉండటంతో మన ఊరు రుచులను చాలా మిస్ అవుతూ ఉంటాం. అలాంటప్పుడు ఎవరైనా మన కుటుంబ సభ్యులో లేక స్నేహితులో మనం ఉన్న దేశానికి వస్తున్నట్లయితే కచ్చితంగా అమ్మ తయారు చేసిన మిఠాయిలను లేదా పచ్చళ్లను తీసుకురమ్మని చెబుతాం. అది వారికి ఎక్స్‌ట్రా లగేజీ అయినప్పటికీ మనకోసం వారు తీసుకొస్తారు. దేశ విదేశాల్లో ఉంటున్న వారికోసం ఇంటి రుచులు అందించాలన్న మంచి ఉద్దేశంతో నేటివ్ స్పెషల్ అనే ఈ- కామర్స్ వెబ్ సైట్ భావిస్తోంది. అమలాపురంలో ఉన్నా... అమెరికాలో ఉన్నా... ఇచ్చాపురంలో ఉన్నా ఇంగ్లాండ్‌లో ఉన్నా... కర్నూలులో ఉన్నా కెనడాలో ఉన్నా ఎక్కడున్నా సరే మిమ్మలను మీ ప్రాంతపు రుచులతో కనెక్ట్ చేస్తుంది నేటివ్ స్పెషల్. ముఖ్యంగా తెలుగు వారింట ఎక్కువగా కనిపించే స్వీట్స్‌ను విదేశాల్లో ఉన్న తెలుగువారికి అందజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది.

ఇక ఆంధ్ర ప్రదేశ్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన తెలుగింటి మిఠాయిలను విదేశాల్లో ఉన్న తెలుగు వారికోసం పార్శిల్ చేసేందుకు నేటివ్ స్పెషల్ రెడీగా ఉంది. విదేశాల్లోనే కాదు ఇటు భారత్‌లో కూడా పలు రాష్ట్రాల్లో సెటిల్ అయిన తెలుగు వారి కోసం తెలుగింటి రుచులను అందించేందుకు నేటివ్ స్పెషల్ ముందుకొస్తోంది. నోరూరించే నెయ్యి అరిసెలు, శ్రీకాకుళం ఉటంకి, నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే ఆత్రేయపురం పూతరేకులు, నెయ్యి నువ్వుల అరిసెలతో పాటు మరిన్ని స్వీట్స్ సిద్దంగా ఉన్నాయి. అంతేకాదు పచ్చళ్లు ఆయా ప్రాంతాల్లో ఫేమస్ అయిన స్థానిక మిఠాయిలు అన్నీ నేటివ్ స్పెషల్‌లో ఉన్నాయి.

ఇంకెందుకు ఆలస్యం.. అమెరికాలో ఉన్నా, ఐరోపా దేశాల్లో ఉన్నా, యూఏఈలో ఉన్నా... మీ ప్రాంతపు మిఠాయిలను మిస్ అవుతున్నట్లయితే వెంటనే https://nativespecial.com/in/ కు లాగిన్ అవ్వండి. అందులో మీకు నచ్చిన స్వీట్స్‌ను ఎంచుకోండి. ఆర్డర్ పెట్టండి. మీ అడ్రస్ వివరాలను పొందుపర్చండి. మిగతాది మేము చూసుకుంటాం. మీరు మిస్ అవుతున్న రుచులను మేము మీ తలపు వద్దకు ఐదు రోజుల్లో చేరుస్తాం. చెన్నై బెంగళూరు నగరాలకైతే రెండు రోజుల్లో పార్శిల్ చేరుతుంది. దేశంలోని ఇతర నగరాలకైతే 3-4రోజుల్లో పార్శిల్ చేరుతుంది. ప్యాకింగ్ చాలా దృఢంగా చేయడం జరుగుతుంది. పార్శిల్ రవాణా సమయంలో అత్యంత జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. అంతేకాదు మీరు ఆర్డర్ చేసిన ఉత్పత్తులు తాజాగా ఉంటాయి. అంతేకాదు మీరు ఆర్డర్ చేసిన మిఠాయి ఏ ప్రాంతంలో అయితే పాపులర్ అయ్యిందో ఆ ప్రాంతం వారే వీటిని తయారు చేస్తారు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా ఇంటి రుచులను మిస్‌ అవుతున్నట్లయితే నేటివ్ స్పెషల్ వెబ్‌సైట్‌ పై లాగిన్ అవ్వండి. ఆర్డర్ చేసేయండి. ఇంటి రుచులను ఆస్వాదించండి. మరిన్ని వివరాల కోసం ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి:

www.nativespecial.com

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X