కేక: ‘అమ్మ డీఎంకే’పార్టీ ఆవిర్భావం, ఇక సినిమా చూపిస్తాం

తమిళనాడులో కొత్త పార్టీ తెరమీదకు వచ్చింది. ద్రావిడ ఇయక్కంలో ఒక్కప్పుడు కీలక నేతగా ఎదిగిన ఈవీకే (ఇళంగోవన్) సంపత్ కుమార్ సోదరుడు ఇనియన్ సంపత్ అమ్మ డీఎంకే పార్టీ (ఏడీఎంకే)ని స్థాపించారు.

చెన్నై: తమిళనాడులో కొత్త పార్టీ తెరమీదకు వచ్చింది. ద్రావిడ ఇయక్కంలో ఒక్కప్పుడు కీలక నేతగా ఎదిగిన ఈవీకే (ఇళంగోవన్) సంపత్ కుమార్ సోదరుడు ఇనియన్ సంపత్ అమ్మ డీఎంకే పార్టీని స్థాపించారు. తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

పార్టీ పేరు అందరిని గందరగోళానికి గురి చేస్తున్నది. ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకే పార్టీని ఆంగ్లంలో ఏఐఏడీఎంకే అంటూ జాతీయస్థాయిలో పిలుస్తారు. అయితే తమిళనాడులో మాత్రం ఇప్పటికీ ఏడీఎంకే అని పిలుస్లుంటారు. పార్టీ కార్యకర్తలు సైతం ఎప్పుడూ ఏడీఎంకే అంటుంటారు.

E.V.K.S. Ilangovan’s brother Iniyan Sambath has started Amma DMK

ఇప్పుడు ఇనియన్ సంపత్ కుమార్ స్థాపించిన పార్టీకి అమ్మ డీఎంకే పార్టీ అని పెట్లారు. దీనిని ఆంగ్లంలో ఏడీఎంకే (అమ్మ డీఎంకే) అని పిలుస్తున్నారు. అమ్మ జయలలిత సేవల్ని ఆకర్షించే విధంగా, అన్నాడీఎంకేలో గందగోళాన్ని రేకెత్తించే విధంగా అమ్మ డీఎంకే పార్టీని స్థాపించారు.

E.V.K.S. Ilangovan’s brother Iniyan Sambath has started Amma DMK

అన్నాడీఎంకే జెండాను పొలిన జెండాను ఇలియన్ సంపత్ చెన్నైలోని తన ఇంటిపై ఎగరవేశారు. అన్నాడీఎంకే పార్టీ జెండాపై రెండాకుల చిహ్నం ఉన్న విషయం తెలిసిందే. అయితే అమ్మ డీఎంకే పార్టీ జెండా మీద జయలలిత విక్టరీ సంకేతంతో చిహ్నాన్ని పొందుపరిచారు. మొత్తం మీద అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలను గందరగోళంలో పడేసే విధంగా అమ్మడీఎంకే పార్టీ ఆవిర్భవించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+