
సీఎంగా షిండే, డిప్యూటీగా ఫడ్నవీస్.. రాజ్ భవన్‌లో ప్రమాణం
మహారాష్ట్రలో ప్రభుత్వం కొలువుదీరింది. అనూహ్యంగా సీఎంగా ఏక్‌నాథ్ షిండే ప్రమాణం చేశారు. అయితే అంతే అనూహ్యంగా దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఏక్‌నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొషియారీ రాజ్ భవన్‌లో వీరిద్దరీతో ప్రమాణం చేయించారు.

ఫడ్నవీస్ ససేమిరా..
మహారాష్ట్ర
సీఎంగా
శివసేన
తిరుగుబాటు
నేత
ఏక్‌నాథ్
షిండే
ప్రమాణ
స్వీకారం
చేయడానికి
ముందుగా
బీజేపీ
అధిష్ఠానం
కీలక
నిర్ణయం
తీసుకుంది.
షిండే
సర్కారులో
బీజేపీ
పాలుపంచుకోవాలని
నిర్ణయం
తీసుకుంది.
దేవేంద్ర
ఫడ్నవీస్‌ను
షిండే
కేబినెట్‌లో
డిప్యూటీ
సీఎంగా
చేరాలని
స్పష్టంచేసింది.
బీజేపీ
జాతీయ
అధ్యక్షుడు
జేపీ
నడ్డా
ఈ
ప్రతిపాదన
చేశారు.
ఫడ్నవీస్
తొలుత
అంగీకరించలేదు.
షిండేనే
సీఎంగా
ఉంటారని
కటించానని,
షిండే
సర్కారుకు
బీజేపీ
బయటి
నుంచి
మద్దతు
ఇస్తుందని
ప్రకటించానని
ఫడ్నవీస్
వివరించారు.

రంగంలోకి అమిత్ షా
పార్టీ
అధిష్ఠానం
తీసుకున్న
నిర్ణయం
మేరకు
డిప్యూటీ
సీఎంగా
చేరాల్సిందేనని
ఫడ్నవీస్‌కు
జేపీ
నడ్డా
సూచించారు.
అప్పటికీ
ఫడ్నవీస్
అంగీకరించలేదు.
దీంతో
కేంద్ర
హోం
శాఖ
మంత్రి
అమిత్
షా
రంగంలోకి
దిగారు.
ఆయనతో
ఫోన్‌లో
మాట్లాడి
సర్దిచెప్పారు.
అమిత్
షా
చెప్పడంతో
డిప్యూటీ
సీఎంగా
ఉండేందుకు
ఫడ్నవీస్
అంగీకరించారు.

మంత్రిమండలి
రాజ్
భవన్‌లో
ఇద్దరూ
నేతలు
ప్రమాణ
స్వీకారం
చేశారు.
వారి
మంత్రిమండలి
ప్రమాణ
స్వీకారానికి
సంబంధించి
ఇప్పటివరకు
సమాచారం
లేదు.
మంత్రివర్గ
కూర్పు
ఎలా
ఉండనుందో..
షిండేకు
కీలకమైన
సీఎం
పదవీ
వరించింది.
మెజార్టీ
మంత్రి
పదవులు
బీజేపీకి
దక్కే
ఛాన్స్
ఉంది.