శశికళకు దెబ్బ మీద దెబ్బ: తీసేయండి, లేదంటే: ఎన్నికల కమిషన్ !

టీటీవీ దినకరన్ అన్నాడీఎంకే పార్టీ అధికారిక వెబ్ సైట్ లో రెండాకుల గుర్తును విచ్చలవిడిగా వాడేసుకోవడంతో శశికళ వర్గానికి వివరణ ఇవ్వాలంటూ భారత ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది.

న్యూఢిల్లీ/చెన్నై: అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ వర్గానికి భారత ఎన్నికల కమిషన్ ఝలక్ ఇచ్చింది. అన్నాడీఎంకే పార్టీ అధికారిక వెబ్ సైట్ లో వెంటనే రెండాకుల చిహ్నం తీసేయాలని ఆదేశాలు జారీ చేసింది.

అంతే కాకుండా పార్టీ వెబ్ సైట్ తో పాటు ఫేస్ బుక్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియాలో రెండాకుల చిహ్నం వాడటాన్ని వెంటనే ఆపేయాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని భారత ఎన్నికల కమిషన్ అధికారులు హెచ్చరిస్తూ శశికళ వర్గానికి నోటీసులు జారీ చేశారు.

టీటీవీ దినకరన్ పోటీతో

టీటీవీ దినకరన్ పోటీతో

జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్ కే నగర్ ఉప ఎన్నిల పోలింగ్ ఈనెల 12వ తేది జరుగుతున్న విషయం తెలిసిందే. శశికళ వర్గం నుంచి అన్నాడీఎంకే అమ్మ పార్టీ అభ్యర్థిగా టీటీవీ దినకరన్ పోటీ చేస్తున్నారు.

 పార్టీ గుర్తు లేకపోవడంతో

పార్టీ గుర్తు లేకపోవడంతో

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న దినకరన్ కు టోపీ గుర్తు, పన్నీర్ సెల్వం వర్గం నుంచి పోటీ చేస్తున్న మధుసూదనన్ కు రెండు కరెంట్ స్థంభాల గుర్తు కేటాయించారు. ఈ సందర్బంలో దినకరన్ అన్నాడీఎంకే పార్టీ అధికారిక వెబ్ సైట్ లో రెండాకుల గుర్తును విచ్చలవిడిగా వాడేసుకోవడంతో ఇంత జరిగిందని ఆయన వర్గంలోని నాయకులు మండిపడుతున్నారు.

ఎందుకు చేశారో చెప్పండి

ఎందుకు చేశారో చెప్పండి

అన్నాడీఎంకే పేరు, రెండాకుల గుర్తును ఉపయోగించరాదని తాము ఇచ్చిన ఆదేశాలను మీరు ఎందుకు ఉల్లంఘించారో వివరించాలంటూ గురువారం ఉదయం వరకు శశికళ వర్గానికి ఎన్నికల కమిషన్ సమయం ఇస్తూ నోటీసులు జారీ చేసింది.

 మొత్తం తీసేయండి

మొత్తం తీసేయండి

అన్నాడీఎంకే పార్టీ రెండాకుల గుర్తు ఇష్టం వచ్చినట్లు ఉపయోగించడం ఐపీఎస్ 171 జి సెక్షన్ ప్రకారం ఎన్నికల నేరమే అవుతుందని భారత ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. రెండాకుల గుర్తును ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో పూర్తిగా తొలగించాలని ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

దినకరన్ పై మండిపడుతున్న పార్టీ సీనియర్లు

దినకరన్ పై మండిపడుతున్న పార్టీ సీనియర్లు

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీటీవీ దినకరన్ ఇష్టం వచ్చినట్లు నిర్ణయం తీసుకుని ఎన్నికల కమిషన్ ఆదేశాలు తుంగలో తొక్కడం వలనే ఇంత జరిగిందని, ఆయన ప్రభుత్వ పెద్దలను, పార్టీ సీనియర్లను లెక్కపెట్టడం లేదని ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+