వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు శుభవార్త: 2018 లో ఐటీ పరిశ్రమకు మంచి రోజులు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలో ఐటీ పరిశ్రమ పుంజుకొనే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా పోటీని తట్టుకొని నిలబడేందుకు ఐటీ పరిశ్రమ ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ఇండియన్ టెక్కీల సత్తాకు నీల్సన్ డీల్ కారణం: నాస్కామ్ఇండియన్ టెక్కీల సత్తాకు నీల్సన్ డీల్ కారణం: నాస్కామ్

ఇప్పటివరకు ఐటీ పరిశ్రమ మందగమనంలో ఉంది. అయితే రానున్న రోజుల్లో ఐటీ పరిశ్రమకు మంచి రోజులు వచ్చే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

టెక్కీలకు శుభవార్త:ఐఐటీ పీజీ విద్యార్థులకు బంపర్ ఆఫర్లిస్తున్న కంపెనీలు, ఎందుకంటే?టెక్కీలకు శుభవార్త:ఐఐటీ పీజీ విద్యార్థులకు బంపర్ ఆఫర్లిస్తున్న కంపెనీలు, ఎందుకంటే?

ఐటీ కంపెనీలు కూడ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకొంటున్నాయి. ఉద్యోగులకు నైపుణ్యాలను పెంచుకొనే శిక్షణలు కూడ కంపెనీలు ఇస్తున్నాయి.

ఐటీ పరిశ్రమకు 2018లో మంచి రోజులు

ఐటీ పరిశ్రమకు 2018లో మంచి రోజులు

ఐటీ పరిశ్రమలో 2018లో మంచిరోజులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా 2018లో ఐటీ కుదురుకుంటుందనే అంచనాలు వెల్లడవుతున్నాయి.కంపెనీలు క్రమంగా ఐటీ వ్యయాలను పెంచుతుండటం, పోటీని తట్టుకునేందుకు నూతన టెక్నాలజీలపై దృష్టి సారించడంతో ఐటీ పరిశ్రమ 2018లో తిరిగి పుంజుకుంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

2017లో ఐటీపై ప్రతికూల పరిస్థితులు

2017లో ఐటీపై ప్రతికూల పరిస్థితులు

2017లో ఐటీ పరిశ్రమపై ప్రతికూల పరిస్థితులు కన్పించాయని ఐటీ నిపుణులు గుర్తు చేస్తున్నారు. గడిచిన ఏడాది కాలంలో ఐటీ రంగంలో రాజకీయ, ఆర్థిక అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయని, కంపెనీలు తిరిగి ఐటీ వ్యయాలు పెంచడంతో సాధారణ పరిస్థితి నెలకొంటుందని నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌ చంద్రశేఖర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రతికూలతలు ఎదురైనా ఫలితాలు

ప్రతికూలతలు ఎదురైనా ఫలితాలు

2017-18లో ఐటీ ఎగుమతుల వృద్ధి రేటు 7 నుంచి 8 శాతంగా ఉన్న అంచనాలను అధిగమిస్తామని చెప్పారు. వీసా ఆంక్షలు సహా పలు ప్రతికూలతలు ఎదురైనా ఆటోమేషన్‌, కృత్రిమ మేథ, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి నూతన టెక్నాలజీల రాకతో పరిశ్రమ స్థిరంగా ముందుకెళుతుందని భావిస్తున్నారు.

ఉద్యోగాలకు భద్రత

ఉద్యోగాలకు భద్రత

ఐటీ పరిశ్రమపై భయాందోళనలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని నాస్కామ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. ఉద్యోగాలు పోతాయనే ఆందోళన కూడ ఉండబోదన్నారు. ఆటోమెషన్, డిజిటల్ వంటి కొత్త టెక్నాలజీ కారణంగా ఎదురౌతున్న సవాళ్ళను శిక్షణ ఇవ్వడం ద్వారా నికర ఉపాధిని కల్పించే పరిశ్రమగా ఐటీ ముందుకు వెళ్ళే అవకాశం ఉందన్నారు.

కొత్త ఆలోచనలతో ముందుకెళ్తే ప్రయోజనం

కొత్త ఆలోచనలతో ముందుకెళ్తే ప్రయోజనం

ఆటోమేషన్, డిజిటల్ వంటి కొత్త టెక్నాలజీల రాకతో ఉద్యోగాలు దెబ్బతింటాయన్న ఆందోళన నెలకొన్నా ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం ద్వారా నికర ఉపాధిని కల్పించే పరిశ్రమగా ఐటీ ముందుందనే సంకేతాలు వెల్లడౌతాయి.

English summary
What doesn't kill you, makes you stronger. That's probably the prescription pill for the USD 150 billion IT industry that faced multiple headwinds in the form of increased visa scrutiny and slowdown in client spending this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X