ప్రపంచంలో భావోద్వేగాలు ఎక్కువ ఉండే జంతువులు, జీవులు ఏమిటో మీకు తెలుసా?
మనుషులకు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మనుషులకు మాత్రమే భావోద్వేగాలు ఉంటాయి అనుకుంటే పొరపాటే. సృష్టిలో ఉన్న జీవరాశులలో చాలా జీవులలో భావోద్వేగాలు ప్రస్ఫుటంగా వ్యక్తమవుతాయి. ప్రపంచంలో అనేక జంతువులు, జీవులు, ఆనందం, దుఃఖం, ప్రేమ, భయం, అనుబంధం వంటి భావాలను వ్యక్తపరుస్తాయి. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం భావోద్వేగ ప్రతిస్పందనలు ఎక్కువగా కనిపించే జంతువుల గురించి మనం తెలుసుకుందాం.
ఏనుగులు
ఏనుగులు గుంపుగా జీవించే బలమైన కుటుంబ బంధాలను కలిగి ఉంటాయి. ఏనుగులలో ఉండే భావోద్వేగాలకు మనకు అనేక సంఘటనలు ఉదాహరణగా నిలుస్తాయి. ఏదైనా ఏనుగు చనిపోతే మిగిలిన ఏనుగులు అక్కడ చేరి దుఃఖాన్ని వ్యక్తపరచడం, ఏదైనా గున్న ఏనుగు కష్టంలో ఉంటే దానిని కాపాడడానికి తల్లి ఏనుగు పడే తాపత్రయం, అనుభవించే భావోద్వేగం మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

డాల్ఫిన్లు
డాల్ఫిన్లు లోతైన భావోద్వేగాలను కలిగి ఉంటాయి. ఇవి తమతో పాటు ఉండే డాల్ఫిన్లు గాయపడితే వాటిని కాపాడడం, వాటితో కలిసి ఆడుకోవడం, పరస్పరం సహకరించడం వంటి అనేక భావోద్వేగ లక్షణాలను వ్యక్తం చేస్తాయి.
కుక్కలు
మనుషులతో అత్యంత అనుబంధం కలిగిన జంతువులలో కుక్కలు ముందుంటాయి యజమాని యొక్క సంతోషాన్ని దుఃఖాన్ని కోపాన్ని గుర్తించి అవి కూడా దానికి తగ్గట్టుగా భావోద్వేగాలను చూపిస్తాయి. కనుక కుక్కలు కూడా భావోద్వేగ జీవులుగా చెప్పవచ్చు.
ఆవులు, పశువులు
ఆవులు కూడా భావోద్వేగాలను బాగా వ్యక్తం చేస్తాయి. ఆవులు చాలా సున్నితమైన, సామాజిక స్వభావం కలిగినటువంటి జీవులు. ఆవులు తమ పిల్లల తోటి బలమైన అనుబంధాన్ని, స్నేహ బంధాలను వ్యక్తీకరించడం మాత్రమే కాదు సంతోషాన్ని కూడా తమ చర్యలతో వ్యక్తీకరిస్తాయి. అటువంటి ఆవులు, పశువులు తమ బిడ్డలకు ఏదైనా కష్టం వచ్చిందని భావించినప్పుడు అవి పడే వేదనను తమ ప్రవర్తన తోనే తెలియజేస్తాయి.
కోతులు, చింపాంజీలు
మనుషులకు సమీప బంధువులు గా చెప్పబడే కోతులు, చింపాంజీలు కూడా సంతోషం, కోపం, ప్రేమ వంటి అనేక భావాలను వ్యక్తం చేస్తాయి. ఇవి బలమైన సామాజిక సంబంధాలను కలిగి ఉంటాయి.
గుర్రాలు
యజమానితో బలమైన నమ్మకాన్ని అనుబంధాన్ని ఏర్పరచుకుంటాయి. గుర్రాలు భయం, విశ్వాసం, ఉత్సాహం అంటే అనేక భావాలను స్పష్టంగా చూపించే భావవ్యక్తీకరణ లక్షణాలు గుర్రాలకు ఉంటాయి.
తిమింగలాలు
తిమింగలాలు కూడా గుంపుగా సంచరిస్తూ పరస్పర సంభాషణల ద్వారా బలమైన బంధాలను కలిగి ఉంటాయి. ఇవి తోటి తిమింగలాలు ఏవైనా గాయపడితే, కష్టంలో ఉంటే రక్షించేందుకు ప్రయత్నం చేస్తాయి. ఇవి కూడా బలమైన భావోద్వేగాలను వ్యక్తం చేస్తాయి.












Click it and Unblock the Notifications