బడ్జెట్లో ఐటీ మినహాయింపు 10 లక్షలకు పెరగనుందా? పెన్షనర్లను తప్పిస్తారా?

త్వరలో కేంద్రం ఈ ఏడాది సాధారణ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా తాము చేయాల్సిన కసరత్తు చేస్తూనే వివిధ వర్గాల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటోంది. ఈ క్రమంలో ఓ కీలకమైన డిమాండ్ ను పలు వర్గాలు కేంద్ర ఆర్ధిక మంత్రి ముందు పెడుతున్నాయి. అది ఆదాయపు పన్ను పరిమితి పెంపు. గతేడాది బడ్డెట్ లో సైతం పెద్దగా మార్పులేవీ లేకపోవడంతో కేంద్రంపై ఆదాయపు పన్ను పరిమితి పెంచాలన్న ఒత్తిడి నెలకొంది.

ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెరుగుతున్న మధ్యతరగతి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచాలని బీజేపీ సైద్ధాంతిక సంస్ధగా చెప్పుకునే ఆరెస్సెస్ అనుబంధ ఉద్యోగ సంఘాలు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరాయి. ఈ మధ్య కాలంలో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంచకపోవడాన్ని కూడా ఆర్ధిక మంత్రికి గుర్తుచేశాయి. దీంతో పాటు మరికొన్ని డిమాండ్లు కూడా ఆర్థికమంత్రి నిర్మల ముందు పెట్టాయి.

employee unions urges FM Nirmala Sitharaman to increase IT limit to rs 10 lakhs exempt pensioners

ఇందులో వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం, ఉపాధి హామీ పథకం పని దినాల్ని 200కు పెంచడం, జీఎస్టీ రిఫండ్స్ వేగవంతం చేయడం, చైనా దిగుమతులకు చెక్ పెట్టేలా ఓ సమగ్ర వస్తు తయారీ విధానం ప్రకటించడం వంటి డిమాండ్లు ఉన్నాయి. కార్మికులు ఎక్కువగా ఉండే వ్యవసాయం, మొక్కల పెంపకం, బీడీ,, మత్సకార రంగాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, అలాగే 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని భారతీయ మజ్దూర్ సంఘ్ నిర్మలా సీతారామన్ ను కోరింది.
అలాగే ఉద్యోగులకు ఎన్పీఎస్, యూపీఎస్ స్ధానంలో ఓపీఎస్ అమలు చేయాలని కూడా సూచించింది.

మరోవైపు ఉద్యోగులకు గ్రాట్యుటీ లెక్కింపు రోజులను సంవత్సరానికి 15 రోజుల నుండి 30 రోజులకు పెంచడం, పెన్షనర్లను పన్ను చెల్లింపు నుండి మినహాయించడం వంటివి కూడా కార్మిక సంఘాల సూచనల్లో ఉన్నాయి. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఈ సూచనలు చేసిన కార్మిక సంఘాల్లో బీఎంఎస్ తో పాటు భారతీయ కిసాన్ సంఘ్, స్వదేశీ జాగరణ్ మంచ్ వంటివి ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+