Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పుల్వామాలో ఎన్ కౌంటర్ ..భద్రతా దళాలకు,టెర్రరిస్ట్ లకు..ఒక టెర్రరిస్ట్ , ఒక జవాన్ మృతి

జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. కంరాజీపొరా ప్రాంతంలో భద్రతా బలగాలు,జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ చేపడుతుండగా ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులకు దిగారు. భద్రతా దళాలు ఆపరేషన్ ప్రారంభించిన తరువాత జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు గాయపడగా, వారిలో ఒక సైనికుడు, ఉగ్రవాది మృతి చెందారని అధికారులు తెలిపారు.

పుల్వామాలోని కమ్రాజిపోరా గ్రామంలో ఒక పండ్ల తోట సమీపంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం ఆధారంగా భద్రతా దళాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారి ఇద్దరు సైనికులు గాయపడ్డారని వారు తెలిపారు. గాయపడిన భద్రతా సిబ్బందిని ఆర్మీ ఆసుపత్రికి తరలించగా, వారిలో ఒకరు చికిత్స సమయంలో మరణించారు .

encounter between security forces and terrorists in Pulwama ... One terrorist, one soldier killed

భద్రతా దళాలకు , ఉగ్రవాదులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక గుర్తు తెలియని ఉగ్రవాది కూడా ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు . కాశ్మీర్ జోన్ పోలీసులు చెప్పారు. కాల్పుల్లో మృతి చెందిన ఉగ్రవాదిని గుర్తించే పనిలో ఉన్నారు .ఎన్‌కౌంటర్ స్థలం నుంచి ఉగ్రవాది వద్ద ఉన్న ఎకె రైఫిల్, కొన్ని గ్రెనేడ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.మిగతా ఉగ్రవాదుల కోసం కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా లో .. పుల్వామా దాడి తర్వాత తాజా ఎన్ కౌంటర్ నేపధ్యంలో తుపాకీ శబ్దాలతో భయానక వాతావరణం నెలకొంది. భారతదేశం టార్గెట్ గా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న ఇంటిలిజెన్స్ సమాచారంతో అప్రమత్తమైన సైన్యం ఉగ్రవాదుల వేట కొనసాగిస్తూనే ఉంది . ఉగ్రవాదుల కదలికల నేపధ్యంలో గత కొంత కాలంగా జమ్మూకాశ్మీర్లో ఏదో ఒక చోట ఎన్కౌంటర్ లు చోటు చేసుకుంటూనే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది .

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+