పోర్న్ ఫోటోలు షేర్: అడ్డంగా బుక్కయ్యాడు
చెన్నయ్: నిషేదిత చిత్రాలను వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసిన ఇంజనీరును చెన్నయ్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. అతని గ్రూప్ లో మహిళలు ఉన్నారు. ఆ విషయం తెలిసి అతను పోర్న్ ఫోటోలు గ్రూప్ లో షేర్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు.
చెన్నయ్ లో ఒకే కంపెనీలో పని చేస్తున్న కొందరు ఉద్యోగులు వాట్సాప్ లో గ్రూప్ గా ఏర్పడ్డారు. ఆ గ్రూప్ లో చెన్నయ్ లో నివాసం ఉంటున్న ఒక ఇంజనీరుతో పాటు మహిళలు ఉన్నారు. గత నెల 29వ తేదిన ఆ ఇంజనీరు చిన్న పిల్లల అసభ్య చిత్రాలను వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేశాడు.

ఫోటోల కింద అసభ్యంగా కామెంట్స్ పోస్ట్ చేశాడు. ఈ విషయం గుర్తించిన ఓ మహిళా ఉద్యోగి చెన్నయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేసి ఇంజనీరును అరెస్టు చేశారు. అతని దగ్గర ఉన్న మొబైల్ స్వాధీనం చేసుకున్నారు.
చిన్నపిల్లలపై లైంగిక దాడుల నిరోధక చట్టం (పోస్కో) కింద ఆ ఇంజనీరు మీద కేసు నమోదు చేశామని సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. గత రెండు నెలలలో చెన్నయ్ లో ఇలాంటి కేసులు మూడు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఇటివల కేంద్ర ప్రభుత్వం 850 పోర్న్ సైట్ ల మీద నిషేదం విదించిన విషయం తెలిసిందే.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications