నాగసాధువులుగా మారిన 10వేలమంది, డాక్టర్లు, గ్రాడ్యుయేట్స్: పరీక్షల్లో పాస్ సులభం కాదు!
అలహాబాద్: రజత్ కుమార్ (27) కచ్‌కు చెందినవారు. అతను మెరైన్ ఇంజినీరింగ్‌లో డిప్లోమా చేశారు. ఈ రూట్లో తన కెరీర్‌ను మలుచుకుంటాడని చాలామంది భావించారు. కానీ అతను మాత్రం ప్రపంచాన్ని పక్కన పెట్టి, తన ఇహ సుఖాలు వదిలేసి.. నాగసాధువుగా మారారు. ముని లేదా రుషిగా ఉండటం చాలా కష్టమైన పని.
కానీ ప్రపంచానికి దూరంగా నాగసాధువుగా మారారు. ఉక్రెయిన్‌లో మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్ చేసిన శంభుగిరి (29), పన్నెండో తరగతిలో టాపర్‌గా నిలిచిన ఉజ్జయినికి చెందిన ఘనశ్యాం గిరి (18).. ఇలా ఎందరో నాగసాధువులుగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు.

నాగసాధువులుగా పదివేలమంది
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ కుంభమేళాలో దాదాపు పదివేల మంది పురుష, మహిళలు నాగసాధువు దీక్ష తీసుకున్నారు.. తీసుకుంటున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళా సందర్భంగా గత వారం పై ముగ్గురితో పాటు వేలాది మంది పిండ ప్రధానం చేశారు. రాత్రంతా జరిగే పవిత్ర అగ్నిపూజలో పాల్గొన్నారు. తద్వారా ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం ద్వారా వీరంతా నాగసాధువులుగా మారిపోయారు.

నాగసాధువులుగా మారిన డాక్టర్లు, ఇంజినీర్లు
ఆ తర్వాత పవిత్ర మౌని అమావాస్య కోసం వేచి చూశారు. సోమవారం (04-02-2019) నాడు పవిత్ర స్నానం చేశారు. ఈ కుంభమేళా పవిత్ర దినాల్లో ఇది ఒకటి. నాగ సాధువులు నగ్నంగా ఉంటారు. నాగ సాధువులుగా ఉండటం సామాన్యుల వల్ల కాదు. అఖిల భారతీయ అఖారా పరిషత్ ప్రకారం ఈ కుంభమేళాలో దాదాపు పదివేల మంది దీక్ష తీసుకొని నాగసాధువులుగా మారిపోయారు... మారిపోతున్నారు. నాగసాధువు దీక్ష కేవలం ఇలాంటి కుంభమేలా సమయంలోనే జరుగుతుంది. ఈసారి వేలాది మంది దీక్ష తీసుకున్నారు. ఇందులో డాక్టర్లు, ఇంజినీర్లు కూడా ఉన్నారు.

నాగ సాధువులుగా మారడానికి పరీక్షలు
ఎప్పుడైతే అఖిల భారతీయ అఖారా పరిషత్ వారిని ఆమోదిస్తుందో.. అప్పటి నుంచి వారి జీవితం.. బయటి వారికి చాలా కఠినంగా కనిపిస్తుంది. అప్పటికే ఉన్న నాగసాధువులు తాజాగా నాగసాధువులుగా మారిన వారిని సంవత్సరాల పాటు పరీక్షిస్తారు. వారు నాగసాధువులుగా ఉండగలుగుతారా, కేవలం ఏదో జీవితంపై విసుగుతో అప్పటికప్పుడు ఆగ్రహంతో వచ్చారా లేక నిజంగానే ఎప్పటికీ ఉండగలుగుతారా అని టెస్ట్ చేస్తారు. ఇప్పుడు నాగసాధువులుగా మారిన ఈ వేలాది మందికి ఈ పరీక్ష ఉంటుంది. వారు తమను తాము నిరూపించుకోవాల్సి ఉంటుంది. అఖిల భారతీయ అఖారా పరిషత్ ఆమోదించాకే వారు నాగసాధువులుగా కొనసాగుతారట. కొందరు తొందరగానే ఈ పరీక్షల్లో నెగ్గుతారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications