Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యూపీలో కొనసాగుతున్న పోలింగ్.. అమేథిలో మొరాయించిన ఈవీఎంలు

అమేథి : పార్లమెంటరీ ఐదో విడత ఎన్నికలు పలుచోట్ల ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కావడంతో.. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే ఉత్తరప్రదేశ్లో ని అమేథి నియోజకవర్గ పరిధిలో ఈవీఎంలు మొరాయించినట్లు సమాచారం. పలు పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు క్యూలోనే నిల్చోవాల్సిన పరిస్థితి.

ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓటు హక్కు వినియోగించుకుందామని వస్తే.. ఎంతసేపు క్యూలో నిలబెడతారని అక్కడి అధికారులను ప్రశ్నించారు. ఈవీఎంలు మొరాయించడంతో సహనం కోల్పోయిన ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే విషయం కాస్తా అధికారుల దృష్టికి వెళ్లడంతో టెక్నికల్ సిబ్బందిని ఆయా బూత్‌లకు పంపి ఈవీఎంలను సెట్ చేయిస్తున్నారు. అదలావుంటే అమేథి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా స్మృతి ఇరానీ, కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీపడుతున్నారు.

evms not working properly in some polling booths in amethi segment
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+