EX MAL: మాజీ ఎమ్మెల్యే కొడుకు, చిన్న తేడాతో అడ్డంగా బుక్కైపోయాడు, సీఐకి రూ. 10 లక్షలు, కారు లంచం !

బెంగళూరు: కొన్ని రోజుల క్రితం రోడ్డు పక్కన ఓ వ్యక్తి శవం కనపడటంతో హడలిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకున్ని పోస్టుమార్టంకు తరలించారు. పోస్టుమార్టం రిపోర్టులో ఆ వ్యక్తి హత్యకు గురైనాడని వెలుగు చూసింది. పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి అతన్ని హత్య చేసింది మేమే అంటూ లొంగిపోయారు. పోలీసులు ముగ్గురికి బెండ్ తియ్యడంతో ఓ బిగ్ షాట్ పేరు బయటకు వచ్చింది. రానురాను 8 మంది పేర్లు బయటకు వచ్చాయి.

మాజీ ఎమ్మెల్యే కొడుకు పేరు బయటకు రావడం కలకలం రేపింది. అయితే హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి ఓ పోలీస్ ఇన్స్ పెక్టర్ సలహా ఇచ్చాడని, శవాన్ని ఆయన పోలీస్ స్టేషన్ పరిధిలో విసిరేస్తే కేసు మొత్తం నేను చూసుకుంటానని చెప్పాడని వెలుగు చూసింది. కేసు నుంచి తప్పించుకోవడానికి పోలీస్ ఇన్స్ పెక్టర్ కు రూ. 10 లక్షల క్యాష్, షోరూమ్ కారు లంచంగా ఇచ్చారని వెలుగు చూడటంతో పోలీసు శాఖ అధికారులు హడలిపోయారు. మాజీ ఎమ్మెల్యే కొడుకుతో పాటు మొత్తం 8 మందిని అరెస్టు చేసిన పోలీసులు పోలీస్ ఇన్స్ పెక్టర్ మీద విచారణ మొదలుపెట్టారు.

 రోడ్డు పక్కన శవం

రోడ్డు పక్కన శవం

కర్ణాటకలోని మండ్య జిల్లాలోని మళవళ్లి తాలుకా పండితహళ్ళి సమీపంలోని రోడ్డు పక్కన ఫిబ్రవరి 9వ తేదీన ఓ వ్యక్తి శవం కనపడింది. రోడ్డు పక్కన ఓ వ్యక్తి శవం కనపడటంతో హడలిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకున్ని పోస్టుమార్టంకు తరలించారు.

 బిగ్ షాట్ పేరు లీక్

బిగ్ షాట్ పేరు లీక్

పోస్టుమార్టం రిపోర్టులో కోళ్లేగాళకు చెందిన సలీమ్ (40( అనే వ్యక్తి హత్యకు గురైనాడని వెలుగు చూసింది. పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి అతన్ని హత్య చేసింది మేమే అంటూ లొంగిపోయారు. పోలీసులు ముగ్గురికి బెండ్ తియ్యడంతో మండ్య జిల్లాకు చెందిన ఓ బిగ్ షాట్ పేరు బయటకు వచ్చింది. రానురాను 8 మంది పేర్లు బయటకు వచ్చాయి.

 మాజీ ఎమ్మెల్యే కొడుకు

మాజీ ఎమ్మెల్యే కొడుకు

సలీమ్ హత్య కేసులో మండ్య జిల్లాలోని కేఆర్ పేట నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే కే.బి. చంద్రశేఖర్ (కాంగ్రెస్) కుమారుడు శ్రీకాంత్ పేరు బయటకు వచ్చింది. ఇదే కేసులో గ్రామ పంచాయితీ మాజీ సభ్యుడు కుమార్, బెంగళూరుకు చెందిన వజ్రమణి, పునీత్, ఆనంద్ హాసన్ కు చెందిన సోమశేఖర్ తో పాటు 8 మంది పేరు బయటకు రావడం కలకలం రేపింది.

 ఇన్స్ పెక్టర్ కు రూ. 10 లక్షలు క్యాష్, కారు లంచం

ఇన్స్ పెక్టర్ కు రూ. 10 లక్షలు క్యాష్, కారు లంచం

హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి మాజీ ఎమ్మెల్యే కొడుకు శ్రీకాంత్ కేఆర్ పేట్ కు చెందిన ఓ పోలీస్ ఇన్స్ పెక్టర్ సలహా ఇచ్చాడని, శవాన్ని ఆయన పోలీస్ స్టేషన్ పరిధిలో విసిరేస్తే కేసు మొత్తం నేను చూసుకుంటానని చెప్పాడని వెలుగు చూసింది. కేసు నుంచి తప్పించుకోవడానికి పోలీస్ ఇన్స్ పెక్టర్ కు రూ. 10 లక్షల క్యాష్, షోరూమ్ కారు లంచంగా ఇచ్చారని వెలుగు చూడటంతో పోలీసు శాఖ అధికారులు హడలిపోయారు.

 100 మీటర్ల తేడా రావడంతో అడ్డంగా చిక్కిపోయారు

100 మీటర్ల తేడా రావడంతో అడ్డంగా చిక్కిపోయారు

అయితే మాజీ ఎమ్మెల్యే కొడుకు శ్రీకాంత్ చెప్పినట్లు కాకుండా అతని అనుచరులు సలీమ్ శవాన్ని 100 మీటర్ల దూరంలో విసిరేయడంతో కేసు పక్క పోలీస్ స్టేషన్ కు వెళ్లిపోయిందని, ఆ దెబ్బతో అందరూ చిక్కిపోయారని మండ్య జిల్లా ఎస్పీ ఎన్. యతీష్ మీడియాకు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొడుకు శ్రీకాంత్ తో పాటు మొత్తం 8 మందిని అరెస్టు చేసిన పోలీసులు పోలీస్ ఇన్స్ పెక్టర్ మీద విచారణ మొదలుపెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+