కేంద్రం ఇచ్చిన ఈ ఛాన్స్ ను సద్వినియోగం చేసుకోండి
IT Returns filing: ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలుపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఐటీఆర్ ఫైలింగ్స్ గడువును ఒకరోజు పొడిగించింది. ఈ విషయాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది. సాధారణంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం విధించే గడువు జూలై 31. ఈ ఏడాది కూడా ఈ గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.
గతంలో ఈ గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. తుది రోజు లక్షల సంఖ్యలో ఐటీఆర్ ఫైలింగ్స్ దాఖలు కావడం వల్ల వెబ్ సైట్ క్రాష్ అయింది. పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ డెడ్ లైన్ ను మరో 24 గంటల పాటు పొడిగించింది. అంటే నేడు కూడా దరఖాస్తుదారులు తమ ఐటీఆర్ ఫైలింగ్స్ ను దాఖలు చేసుకోవచ్చు. ఈ మేరకు సీబీడీటీ ట్వీట్ పోస్ట్ చేసింది.

15వ తేదీ నాటికి 7.3 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. ఇది గత సంవత్సరం దాఖలైన 7.28 కోట్ల ఐటీఆర్‌ల సంఖ్యను అధిగమించి కొత్త రికార్డును నెలకొల్పింది. పన్ను చెల్లింపుదారులు, నిపుణులు సకాలంలో సహకరించినందుకు సీబీడీటీ ధన్యవాదాలు తెలిపింది. ఐటీఆర్‌ల దాఖలును సులభతరం చేయడానికి.. గడువును ఒక రోజు (సెప్టెంబర్ 16) పొడిగించినట్లు ఈ ట్వీట్ లో పొందుపరిచింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ లన్నీ గడువులోగా ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇదే తొలి పొడిగింపు. మున్ముందు మళ్లీ ఉండకపోవచ్చు. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన దరఖాస్తుల్లో గణనీయమైన సవరణలు చేసింది సీబీడీటీ. ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. దీనికి అనుగుణంగా సిస్టమ్ డెవలప్ చేసింది. ఫలితంగా- ఈ ప్రాసెస్ అవసరాలకు అనుగుణంగా ఐటీఆర్ ఫైలింగ్స్ లో కొంత సమయం తీసుకుంటుంది.
ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ క్రెడిట్ రెఫ్లెక్షన్ కారణంగా ఐటీ ఫైలింగ్ లో ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఆ సమయంలో కోట్ల సంఖ్యలో దాఖలు అయ్యే ఐటీఆర్ ఫైలింగ్స్ లల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి గడువును పొడిగించినట్లు సీబీడీటీ వెల్లడించింది. పన్ను చెల్లింపుదారుల నుంచి అందిన సూచనలు, సలహాల నేపథ్యంలో బ్రౌజర్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications