న్యూడ్ కాల్ చేసింది, ఫేస్ బుక్ ప్రియురాలి దెబ్బకు రిటైడ్ మామకు ఊడిపోయింది, ఆ వీడియో కాల్ తో ?
ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన యువతితో తిక్కతిక్కగా చేసిన చాటింగ్, న్యూడ్ వీడియో కారణంగా 69 ఏళ్ల వ్యక్తి రూ.1.70 లక్షలు పోగొట్టుకున్నాడు. కొద్ది రోజుల క్రితం ఈ సీనియర్ సిటిజన్ ఫేస్‌బుక్‌లో గుర్తు తెలియని యువతితో పరిచయమయ్యాడు. యువతి పరిచయం అయిన తరువాత బెంగళూరు వ్యక్తికి మంచి రోజులు వస్తాయని అనుకుంటే సీన్ సితారా అయిపోయింది.
ఓ రోజు ఓ యువతి ఈ వృద్ధుడికి న్యూడ్ వీడియో కాల్ చేసి తరువాత ఆయన మాట్లాడుతున్న సమయంలో ఆ వీడియో కాల్ ను రికార్డ్ చేసింది. తరువాత ఆమె సహచరులు వృద్ధుడిని బెదిరించి లొంగదీసుకోవడంతో అక్కడ అసలు కథ మొదలైయ్యింది. అయితే కిలాడీతో పాటు ఆమె అనుచరులు పదేపదే బ్లాక్ మెయిల్ చేసి బెదిరించడంతో ఆ వృద్ధుడు బెంగళూరు పోలీసులను ఆశ్రయించాడు.

బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ సమీపంలోని గుంజూర్‌లో నివాసం ఉంటున్న ఆ వ్యక్తి ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేసి రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన సావాంత్ (పేరు మార్చడం జరిగింది) ప్రతిరోజు వాకింగ్ వెలుతూ కుటుంబ సభ్యులతో కాలం గడుపుతూ ఉన్నాడు. టైమ్ పాస్ కోసం అలవాటు చేసుకునన సోషల్ మీడియాలో సావంత్ ఎక్కువగా యాక్టీవ్ ఉన్నాడు.
కొంతకాలం క్రితం తాను ఫేస్ బుక్ లో కోమలి శర్మా అనే యువతితో చాట్ చేశానని సావంత్ పోలీసులకు చెప్పాడు, తరువాత కోమలి శర్మా, తాను నిత్యం ఫేస్‌బుక్‌లో చాట్ చేసుకుంటూ టచ్ లో ఉన్నామని సాంవత్ అంటున్నాడు. నవంబర్ 21వ తేదీన కోమలి శర్మా నుండి వీడియో కాల్స్ రావడం మొదలైనాయని, మొదటి వీడియో కాల్ కట్ చేశానని, అయితే కోమలి శర్మా పదేపదే తనకు వీడియో కాల్ చేసిందని సావంత్ ఆరోపిస్తున్నాడు.

చివరకు అతను వీడియో కాల్‌ని రిసీవ్ చేశానని, వెంటనే ఎదురుగా కోమలి శర్మా నగ్నంగా కనపడి తనతో అసభ్యంగా మాట్లాడటం ప్రారంభించిందని, ఆ సమయంలో తాను కాల్ కట్ చేశానని, తరువాత మళ్లీ ఆమె వీడియో కాల్ చేసిందని, తరువాత నువ్వు ఇలా న్యూడ్ గా తనకు వీడియో కాల్స్ చెయ్యకూడదని చెప్పి తాను ఆ కాల్ కట్ చేశానని సావంత్ పోలీసులకు చెప్పాడు. సావంత్ తో ఆ మహిళ న్యూడ్ గా వీడియో కాల్ లో మాట్లాడుతున్న సమయంలో ఆమె ఆ వీడియో కాల్ రికార్డు చేసింది.
కాసేపటి తర్వాత ఆ మహిళ, పురుషుడు ఇద్దరి దృశ్యాలను చూపించే వీడియోను అతడికి పంపించారు. మేము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే నీ న్యూడ్ వీడియో కాల్స్ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామని బెదిరించడం ప్రారంభించారని సావంత్ ఆరోపించాడు. ఆతర్వాత కోమలి శర్మా అనే మహిళ వీడియో కాల్ కట్ చేయడమే కాకుండా సావంత్ మెసెంజర్‌లో ఆమె నెంబర్ బ్లాక్ చేశాడని తెలిసింది.

మరుసటి రోజు ఇద్దరు అపరిచిత వ్యక్తులు సావంత్ కు ఫోన్ చేసి నీ న్యూడ్ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరించారు. నీ వీడియో యూట్యూబ్ లో అప్ లోడ్ చెయ్యకూడదు అంటే రూ.76,500 ఇవ్వాలని సావంత్ ను డిమాండ్ చేశారు. దీంతో భయాందోళనకు గురైన సావంత్ గుర్తు తెలియని నిందితులు ఇచ్చిన బ్యాంక్ ఖాతా నంబర్‌కు గూగుల్ పే ద్వారా రూ 76 వేలు పంపించాడు.
దీని తర్వాత మరొకరు సావంత్ కు ఫోన్ చేసి నీ న్యూడ్ వీడియో యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తామని, మేము సైలెంట్ గా ఉండాలంటే మాకు రూ. 94,000 ఇవ్వాలని బెదిరించారు. భయపడిపోయిన సావంత్ మళ్లీ డిజిటల్ పేమెంట్ ద్వారా నిందితులు చెప్పిన బ్యాంక్ అకౌంట్ కు రూ 94 వేలు బదిలీ చేశాడు.అయితే పదేపదే నిందితులు న్యూడ్ వీడియోను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చెయ్యడంతో సావంత్ హడలిపోయాడు.
నిందితుల బెదిరింపులు తట్టుకోలేక సావంత్ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు సైబర్ క్రైమ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు గుర్తు తెలియని యువతితో ఆమె గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు. తాను గుర్తు తెలియని యువతితో చాటింగ్ చేశానని సావంత్ చెబుతున్నాడని, వీడియో కాల్ లో మాట్లాడే సమయంలో సావంత్ నగ్నంగా ఉన్నానో లేదో తెలియడం లేదని, తన ఫొటోను అసభ్యకరంగా ఎడిట్ చేశారని సావంత్ అంటున్నాడని, కేసు విచారణ కొనసాగుతోందని బెంగళూరులోని వైట్ ఫీల్డ్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications