పొడవుతో ఏం పని, నాక్కావలసింది నీ దగ్గరుంది, మరుగుజ్జును పెళ్లి చేసుకున్న కాలేజ్ అమ్మాయి!

చెన్నై/కరూర్: ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన మరుగుజ్జును వివాహం చేసుకోవాలని నిర్ణయించింది కాలేజ్ అమ్మాయి. నాక్కావలసింది నీ దగ్గర ఉందని మరుగుజ్జుకు చెప్పింది. కుటుంబ సభ్యులు హెచ్చరించినా ఏ మాత్రం పట్టించుకోని కాలేజ్ అమ్మాయి, ఉండాల్సింది పొడవు (ఎత్తు కాదు), ఏది ఉండాలో అది నా ప్రియుడి దగ్గర పుష్కలంగా ఉందని, అతనినే పెళ్లి చేసుకుంటానని కుటుంబ సభ్యులకు తేల్చి చెప్పింది. పెద్దలను ఎదిరించి మరుగుజ్జును వివాహమాడిన కాలేజ్ అమ్మాయి ఇప్పుడు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించింది.

 కాలేజ్ అమ్యాయి

కాలేజ్ అమ్యాయి

తమిళనాడులోని శివగంగై ప్రాంతంలో నివాసం ఉంటున్న పవిత్ర (21) ఫార్మసి విద్యాభ్యాసం చేస్తున్నది. తమిళనాడులోని కరూర్ సమీపంలోని తేరూరు ప్రాంతానికి చెందిన విఘ్నేశ్వరన్ (25) నాలుగు అడుగుల ఎత్తు మాత్రమే ఉన్నాడు. విఘ్నేశ్వరన్ ఓ ప్రేవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

 నా ఎత్తు నాలుగు అడుగులు!

నా ఎత్తు నాలుగు అడుగులు!

పవిత్ర, విఘ్నేశ్వరన్ కు ఫేస్ బుక్ ద్వారా మూడు సంవత్సరాల క్రితం పరిచయం అయ్యింది. నా ఎత్తు నాలుగు అడుగులు మాత్రమే అని ఓ సారి విఘ్నేశ్వరన్ పవిత్రకు చెప్పాడు. ఎంత ఎత్తు ఉన్నాము అనే విషయం సమస్య కాదని, మంచి మనసు ఉందా? లేదా ? అనేదే ముఖ్యమని పవిత్ర చెప్పింది.

పేస్ బుక్ లవ్

పేస్ బుక్ లవ్

ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన పవిత్ర, విఘ్నేశ్వరన్ గత మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. 9 నెలల క్రితం ఇద్దరూ నేరుగా కలుసుకుని ఒకరి గురించి ఒకరు మనసు విప్పి మాట్లాడుకున్నారు. పవిత్ర, విఘ్నేశ్వరన్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు.

నీకు ఎవ్వరూ చిక్కలేదా?

నీకు ఎవ్వరూ చిక్కలేదా?

తాము పెళ్లి చేసుకుంటామని పవిత్ర, విఘ్నేశ్వరన్ వారి కుటుంబ సభ్యులకు చెప్పారు. నువ్వు మంచి చదువు చదువుతున్నావని, ఎవ్వరూ చిక్కనట్లు మరుగుజ్జును చేసుకుంటావా ? మేము ఈ పెళ్లికి అంగీకరించమని పవిత్ర కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. ఇప్పుడు చెప్పడానికి బాగానే ఉందని, ముందుముందు చాలా సమస్యలు ఎదురౌతాయని, తాము ఈ పెళ్లికి అంగీకరించమని విఘ్నేశ్వరన్ కుటుంబ సభ్యులు చెప్పారు.

పొడవుతో ఏం పని, నాక్కావలసింది నీ దగ్గర ఉంది!

పొడవుతో ఏం పని, నాక్కావలసింది నీ దగ్గర ఉంది!

పొడవులో ఏముందని, నాకు అన్ని విషయాలు తెలుసని, విఘ్నేశ్వరన్ నే పెళ్లి చేసుకుంటానని పవిత్ర ఆమె కుటుంబ సభ్యులకు తేల్చి చెప్పింది. కుటుంబ సభ్యులను ఎదిరించిన పవిత్ర, విఘ్నేశ్వరన్ కరూర్ లోని శ్రీ ఈశ్వరన్ ఆలయంలో స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అనంతరం మా కుటుంబ సభ్యుల నుంచి మాకు భద్రత కల్పించాలని పవిత్ర కరూరు మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఆశ్రయించింది. పొడవులో ఏముందని, నాక్కావలసిన మనుసు విఘ్నేశ్వరన్ దగ్గర ఉందని పవిత్ర చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+