Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీజేపీ ఎమ్మెల్యే, లేడీ ఎస్ఐ అక్రమ సంబంధం ? రచ్చరచ్చ, భార్య రివర్స్ గేర్: ఏం జరిగింది !

మహిళా సబ్ ఇన్స్ పెక్టర్ (ఎస్ఐ)తో బీజేపీకి చెందిన ఎమ్మెల్యే రాసలీలలు సాగిస్తున్నారని కర్ణాటక మహిళా కమిషన్ కు ఫిర్యాదు చెయ్యడంతో ఆ పార్టీ నాయకులు హడలిపోయారు.

బెంగళూరు: మహిళా సబ్ ఇన్స్ పెక్టర్ (ఎస్ఐ)తో బీజేపీకి చెందిన ఎమ్మెల్యే రాసలీలలు సాగిస్తున్నారని కర్ణాటక మహిళా కమిషన్ కు ఫిర్యాదు చెయ్యడంతో ఆ పార్టీ నాయకులు హడలిపోయారు. స్వయంగా బీజేపీ ఎమ్మెల్యే భార్య సౌమ్యా మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారని బుధవారం మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.

కర్ణాటకలోని రాయచూరు గ్రామీణ శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే (బీజేపీ) తిప్పరాజు హవాల్దార్, బెంగళూరు గ్రామీణ జిల్లాలోని దోడ్డబళ్లాపుర సమీపంలోని విశ్వనాథపుర పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్ పెక్టర్ గా పని చేస్తున్న బేబీ వాలేకర్ అక్రమ సంబంధం సాగిస్తున్నారని ఆరోపణలు కన్నడ టీవీ చానెల్స్ లో గుప్పుమన్నాయి.

నా ప్రాణాలకు ముప్పు !

నా ప్రాణాలకు ముప్పు !

తన భర్త తిప్పరాజు హవాల్దార్ నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనకు భద్రత కల్పించాలని బీజేపీ ఎమ్మెల్యే భార్య సౌమ్యా మహిళా కమిషన్ అధికారులకు మనవి చేశారని కొన్ని కన్నడ టీవీ చానల్స్ లో వార్తలు ప్రసారం అయ్యాయి.

నాకు తెలీదు, ఎవరు చెప్పారు ?

నాకు తెలీదు, ఎవరు చెప్పారు ?

బీజేపీ ఎమ్మెల్యే తిప్పరాజు హవాల్దార్, మహిళా ఎస్ఐ బేబీ వాలేకర్ రాసలీలలు అంటూ మీడియాలో జోరుగా ప్రసారం అవుతున్న సమయంలో ఆయన భార్య సౌమ్యా రాయచూరులో మీడియాతో మాట్లాడారు. తన భర్త మీద తాను మహిళా కమిషన్ అధికారులకు ఫిర్యాదు చెయ్యలేదని, అసలు ఆ విషయం తనకు తెలీదని సౌమ్యా వివరణ ఇచ్చారు.

హోం మంత్రికి చెప్పారని !

హోం మంత్రికి చెప్పారని !

2013లో ఎమ్మెల్యే అయిన తిప్పరాజు రాయచూరు జిల్లా ప్రోబషనరిలో ఉన్న బేబీ వాలేకర్ ను స్థానిక ఏపీఎంసీ పోలీస్ స్టేషన్ ఎస్ గా నియమించాలని అప్పటి హోం శాఖ మంత్రి కేజే. జార్జ్ ను కలిసి మనవి చేశారని అప్పట్లోనే వార్తలు గుప్పుమన్నాయి.

అక్కడే మాటలు, రాసలీలల వరకు ?

అక్కడే మాటలు, రాసలీలల వరకు ?

ఏపీఎంసీ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్ పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బేబీ వాలేకర్ తరువాత ఎమ్మెల్యే తిప్పరాజుతో నిత్యం టచ్ లో ఉన్నారని, వారి మద్య మాటలు ఎక్కువ అయ్యి చనువుగా ఉన్నారని, చివరికి ఇద్దరి మద్య అక్రమ సంబంధానికి దారి తీసిందని ఆరోపణలు వచ్చాయి.

పై అధికారులు, డోంట్ కేర్ !

పై అధికారులు, డోంట్ కేర్ !

ఎమ్మెల్యే తిప్పరాజుతో ఉన్న చనువుతో బేబీ వాలేకర్ పై అధికారులను లెక్కచెయ్యలేదని, ఈ విషయంపై ఆమె పై అధికారులు రాయచూరు జిల్లా ఎస్పీకి అనేక సార్లు ఫిర్యాదు చేశారని, అయినా ఆమె లెక్కచెయ్యలేదని బుధవారం స్థానిక మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి.

ఇంటిలోనే మకాం పెట్టారని ?

ఇంటిలోనే మకాం పెట్టారని ?

భార్య, పిల్లలు ఇంటిలో లేని సమయంలో ఎమ్మెల్యే తిప్పరాజు ఇంటికి మహిళా ఎస్ఐ బేబీ వాలేకర్ వెళ్లేవారని, ఈ విషయంపై స్థానికుల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగిందని, ఈ విషయంపై ఎమ్మెల్యే భార్య నిఘా వెయ్యడంతో వారి అసలు బండారం బయటపడిందని బుధవారం ఓ కన్నడ పత్రిక ( సాయంత్రం ఎడిషన్) వార్త ప్రచురించింది.

ఫిర్యాదు చేశారు, ఆమె పేరు మాత్రం !

ఫిర్యాదు చేశారు, ఆమె పేరు మాత్రం !

ఎమ్మెల్యే తిప్పరాజు, మహిళా ఎస్ఐ బేబీ వాలేకర్ అక్రమ సంబంధం సాగిస్తున్నారని తనకు ఫిర్యాదు అందిందని, అందులో ఎమ్మెల్యే భార్య సౌమ్య పేరు లేదని మహిళా కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మి బాయి మీడియాకు వివరణ ఇచ్చారు. ఫిర్యాదు లేఖ ఎవరు పంపించారు ? అని విచారణ చేస్తున్నామని నాగలక్ష్మి బాయి తనను కలిసిన మీడియాకు చెప్పారు.

టీచర్, బీజేపీ లింక్ తో ఎమ్మెల్యే !

టీచర్, బీజేపీ లింక్ తో ఎమ్మెల్యే !

తిప్పరాజు గతంలో ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పని చేశారు. టీచర్ అయినా తిప్పరాజు ఎక్కువగా బీజేపీ నాయకులతో తిరిగే వారు. తరువాత ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపోందారు. చివరికి ఎమ్మెల్యే స్థాయికి వచ్చిన తిప్పరాజుపై అనేక ఆరోపణలు ఉన్నాయి.

సౌమ్యా రివర్స్ గేర్

సౌమ్యా రివర్స్ గేర్

తన భర్త తిప్పరాజు రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరుకుంటున్న విషయం జీర్ణించుకోలేని వారే ఇలా ఆరోపణలు చేస్తున్నారని, నేను నా భర్తతో కలిసి సంతోషంగా ఉంటున్నానని, మహిళా కమిషన్ కు ఆయన మీద ఎవరు ఫిర్యాదు చేశారో త్వరలోనే వెలుగు చూస్తోందని బుధవారం సౌమ్య రాయచూరులో మీడియాకు చెప్పారు.

లేడీ ఎస్ఐ, ఎమ్మెల్యే ఫైర్ !

లేడీ ఎస్ఐ, ఎమ్మెల్యే ఫైర్ !

తన పేరు బయటపెట్టి తప్పుడు ఆరోపణలు చేసిన మహిళా కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మి బాయి మీద లేడీ ఎస్ బేబీ వాలేకర్ ఫైర్ అయ్యారు. ఆమెను కలిసి వివరణ అడుగుతానని కన్నడ టీవీ చానల్ తో అన్నారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే తిప్పరాజు తన రాజకీయ ఎదుగుదల చూసి జీర్ణించుకోలేని కొందరు ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మొత్తం మీద బుధవారం బీజేపీ ఎమ్మెల్యే తిప్పరాజు, లేడీ ఎస్ బేబీ వాలేకర్ రాసలీలలు అంటూ మీడియా కోడైకూస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+