దీపా ఇంటిలో ఐటీ సోదాల డ్రామా, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం భర్త, మాధవన్ మాయం!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా ఇంటి దగ్గర శనివారం నానా హంగామా చేసిన నకిలీ ఆదాయపన్ను శాఖ అధికారి చెన్నైలోని మాంబరం పోలీసుల ముందులోంగిపోయాడు. విల్లుపురం జిల్లాకు చెందిన ప్రభాకరన్ అనే వ్యక్తి దీపా ఇంటి దగ్గర నకిలీ ఆదాయపన్ను శాఖ అధికారిగా నటించాడని పోలీసులు అంటున్నారు. అయితే ఈ డ్రామాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం దీపా భర్త మాధవన్ అని పోలీసులు బాంబు పేల్చారు.

సినిమా చాన్స్ కోసం

సినిమా చాన్స్ కోసం

ఆదాయపన్ను శాఖ అధికారిగా మా ఇంటి దగ్గరకు వచ్చి నువ్వు హంగామా చేస్తే సినిమాల్లో నటించడానికి చాన్స్ ఇప్పిస్తానని దీపా భర్త మాధవన్ భరోసా ఇచ్చారని, ఆదాయపన్ను శాఖ నకిలీ ఐడీ కార్డు, నకిలీ నోటీసు సైతం దీపా భర్త మాధవన్ ఇచ్చారని ప్రభాకరన్ అంగీకరించాడని పోలీసులు చెప్పారు.

మాధవన్ మీద చర్యలు

మాధవన్ మీద చర్యలు


నకిలీ ఆదాయపన్ను శాఖ అధికారిగా నటించమని ప్రభాకరన్ ను మాధవన్ ఎందుకు రెచ్చగొట్టాడు అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆదాయపన్ను శాఖ నకిలీ ఐడీ కార్డు, డాక్యూమెంట్లు తయారు చేసిన మాధవన్ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు.

తప్పించుకోవడానికి !

తప్పించుకోవడానికి !


దీపా ఇంటి దగ్గర నకిలీ ఆదాయపన్ను శాఖ అధికారిగా నటించిన తనను అక్కడి నుంచి తప్పించుకోవడానికి దీపా భర్త సహకరించాడని ప్రభాకరన్ అంగీకరించాడని పోలీసులు అన్నారు. మాధవన్ సహకరించడం వలనే పోలీసులు అక్కడికి రాకముందే తాను వెళ్లిపోయానని ప్రభాకరన్ అంటున్నాడు.

మాధవన్ మాస్టర్ ప్లాన్

మాధవన్ మాస్టర్ ప్లాన్


ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై పార్టీ స్థాపించిన దీపా పార్టీ పదవులు ఇచ్చి భారీ మొత్తంలో నగదు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. నకిలీ ఆదాయపన్ను శాఖ అధికారి దగ్గర డ్రామాలు వేయిస్తే దీపా దగ్గర ఎంత మొత్తంలో నగదు, నగలు ఉన్నాయి అని గుర్తించవచ్చని, తన శత్రువు తన భార్య కారు డ్రదైవర్ రాజాకు భయం పెట్టవచ్చని మాధవన్ మాస్టర్ ప్లాన్ వేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు

మాధవన్ మాయం

మాధవన్ మాయం

మిథేష్ కుమార్ పేరుతో నకిలీ ఆదాయపన్ను శాఖ అధికారిగా డ్రామా ఆడించిన దీపా భర్త మాధవన్ మాయం అయ్యాడు. మాధవన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీపా, మాధవన్ కలిసి రాజకీయంగా పబ్లిసిటీ పెంచుకోవడానికి ఆలాంటి నాటకాలు ఆడుతున్నారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Deepa's husband Madhavan only arranged the IT raid Drama on saturday. This drama leads many doubts on Deepa that she has large amount of black money in her house.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి