ఫ్యామిలీ సమస్యలు, దానికి తోడు అక్రమ సంబంధం, రాత్రి ఇంట్లో ఏం జరిగిందంటే ?
బెంగళూరు/సింధనూరు: యువతి, యువకుడు పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో కాకుండా దంపతులు వేరే ఇంటిలో నివాసం ఉంటున్నారు. దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి, అక్రమ సంబంధం విషయంలో దంపతుల మధ్య తేడాలు వచ్చాయి. నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావని భార్య అంటే లేదు నువ్వు అక్రమ సంబంధం పెట్టుకుని ప్రియుడితో తిరుగుతున్నావని భర్త గొడవపడేవాడు. దంపతుల గొడవల్లో ఒకరి ప్రాణం పోయింది.
కర్ణాటకలోని సింధనూరు తాలుకాలోని హెసళ్లి ఇజీ క్యాంప్ ఏరియాలో శశికాంత్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని ఏళ్ల క్రితం గౌరమ్మ అలియాస్ గౌరీ అనే మహిళను శశికాంత్ పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న శశికాంత్, గౌరమ్మ దంపతులు వేరుగా నివాసం ఉంటూ ఇంతకాలం హ్యాపీగానే ఉన్నారని తెలిసింది. దంపతులకు ఓ కుమార్తె. ఓ కుమారుడు ఉన్నారు. అయితే ఇటీవల పరిస్థితులు తారుమారైనాయి,

కొంతకాలం నుంచి శశికాంత్, గౌరమ్మ దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి. నువ్వు అక్రమ సంబంధం పెట్టుకుని తనను పట్టించుకోవడం లేదని గౌరీ ఆమె భర్త శశికాంత్ తో గొడవకు దిగింది. ఇదే సమయంలో రాత్రిపూట భర్త శశికాంత్ ఎప్పుడంటే అప్పుడు ఇంటికి వెళ్లడంతో అతని భార్య గౌరీకి ఇంకా అనుమానం ఎక్కువ అయ్యిందని తెలిసింది.
ఇటీవల నువ్వే అక్రమ సంబంధం పెట్టుకున్నావని, నేను ఇంట్లో లేనిసమయంలో ప్రియుడితో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నావని శశికాంత్ అతని భార్య గౌరీతో గొడవపడుతున్నాడు. కొంతకాలం శశికాంత్ మద్యం మత్తులో ఇంటికి వెళ్లి అతని భార్య గౌరీని చితకబాదుతున్నాడని తెలిసింది. గౌరీ ఆమె సోదరుడు మల్లేష్ కు ఫోన్ చేసి జరిగిన మ్యాటర్ చెప్పింది.

మల్లేష్ నేరుగా సోదరి గౌరీ ఇంటికి వెళ్లి అతని బావ శశికంత్ తో గొడవపెట్టుకున్నాడు. ఇంకోసారి ఇలాంటి గొడవలు జరిగితే నీ మీద పోలీసు కేసు పెడుతానని మల్లేష్ అతని బావ శశికాంత్ ను హెచ్చరించాడు. రెండు రోజుతు శశికాంత్, గౌరీ దంపతులు బాగానే ఉన్నారు. తరువాత మళ్లీ ఇద్దరి మద్య గొడవలు ఎక్కువ అయ్యాయని తెలిసింది.
రాత్రి శశికాంత్, గౌరీ దంపతులు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారని తెలిసింది. ఆ సమయంలో ఏం చెయ్యాలని తెలీక ఇద్దరు పిల్లలు ఏడ్చాడు. తరువాత శశికాంత్, గౌరి దంపతులు సైలెంట్ అయిపోయి వాళ్ల గదుల్లోకి నిద్రపోయారు. ఉదయం చూస్తే గౌరీ ఉరి వేసుకున్న స్థితిలో శవమై కనిపించింది. కుటంబ సమస్యల కారణంగా గౌరీ ఆత్మహత్య చేసుందా ?, ఆమె భర్త ఆమెను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరిస్తున్నాడా ? అని దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications