Onion Price: అన్నదాతను కన్నీరు పెట్టిస్తోన్న ఉల్లి.. కిలో రూపాయికి పడిపోయిన ధర..
గత ఏడాది నవంబర్, అక్టోబర్ లో ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. దీంతో వినియోగదారులు ఉల్లి కొనడానికి ఇబ్బంది పడ్డారు. చాలా మంది వంటల్లో ఉల్లి వినియోగం తగ్గించారు. అప్పుడు కిలో ఉల్లి రూ. 50 నుంచి రూ.70 పలికింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉల్లి ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది. బఫర్ స్టాక్ విడుదల చేయడమే కాకుండా కిలో ఉల్లి రూ.25 లకే అందించింది. ఉల్లి ఎగుమతలపై నిషేధం విధించింది.
ఆ తర్వాత ఉల్లి ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. తాజాగా ఉల్లి ధరలు భారీగా పడిపోయాయి. దీంతో రైతులకు కన్నీరే మిగులుతోంది. ఉల్లి కనిష్ట ధర ధరకు పడిపోవడంతో అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి కిలోకు రూపాయి పలకడంతో రవాణా ఖర్చులు కూడా రావడం లేదని వాపోతున్నారు. కనీసం పెట్టబడి పైసలు కూడా రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

మహారాష్ట్రలోని సోలాపూర్, రాహురి మార్కెట్లలో ఫిబ్రవరి 10న కిలో ఉల్లి ధర రూ. 1కి పడిపోయింది. మన్మాడ్‌లో కిలో ఉల్లి ధర రూ.2గా ఉంది. దీంతో ఉల్లి రైతులు కన్నెర్ర జేస్తున్నారు. ఉల్లి సాగు చేపట్టబోమని స్పష్టం చేస్తున్నారు. ఉల్లి రైతులు బాగుపడాలంటే వెంటనే ఉల్లి ఎగుమతులపై ఉన్న నిషేధం ఎత్తివేయాలని కోరుతున్నారు. ఎగుమతిపై నిషేధం కారణంగానే కిలో ఉల్లి రూ.1 నుంచి రూ.8 పలుకుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉల్లి ధరలు భారీగా పడిపోయినా.. కేంద్ర ప్రభుత్వం ఎగుమతుల నిషేధ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం దారుణమన్నారు. ఫిబ్రవరి 10న సోలాపూర్ మార్కెట్‌కు 30వేల క్వింటాళ్ల ఉల్లి వచ్చన్నారు. కనీస ధర క్వింటాల్‌కు రూ.100గా ఉంది అంటే కిలోక రూపాయి పలికినట్లు. లక్ష క్వింటాళ్లకు పైగా వచ్చిన ధర అదే స్థాయిలో ఉండటంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. మొన్నటి వరకు వినియోగదారులను ఏడిపించిన ఉల్లి.. ఇప్పుడు పండించిన రైతులను ఏడిపిస్తోంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications