ఢిల్లీ తరహాలో హర్యానాలోనూ సుదీర్ఘ నిరసనలు-రైతు సంఘాల ప్లాన్-సర్కార్ తో చర్చలు విఫలం

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుల్ని వ్యతిరేకిస్తూ గతంలో ఢిల్లీలో భారీ ఎత్తున నిరసనలు చేపట్టి దేశం దృష్టిని ఆకర్షించిన రైతు సంఘాలు ఇప్పుడు హర్యానాలోనూ అదే వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్దమవుతున్నాయి. వ్యవసాయ బిల్లులపై రైతులు ఆందోళనలు చేస్తున్న సందర్భంగా వాటిని అడ్డుకునేందుకు హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం పోలీసులతో లాఠీ ఛార్జ్ చేయించింది. దీనిపై ఆగ్రహంగా ఉన్న రైతులు ఇప్పుడు ప్రభుత్వంతో జరుపుతున్న చర్చల్లో ఆ విషయాన్నే కీలకంగా ప్రస్తావిస్తున్నారు.

హర్యానాలో తమపై లాఠీ ఛార్జ్ జరిపిన పోలీసులపై చర్చలు తీసుకోవాలని కోరుతున్న రైతులతో ప్రభుత్వం ఇవాళ జరిపిన చర్చలు కూడా విఫలమయ్యాయి. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో రైతు సంఘాలు చర్చల నుంచి వెనక్కివచ్చాయి. ఆ తర్వాత హర్యానాలో ఢిల్లీ తరహాలోనే టెంట్లు వేసుకుని సుదీర్ఘ నిరసనలు తెలపాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. రైతుల ఆందోళనలపై మనోహర్ లాల్ ఖత్తర్ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ వెనక్కి తగ్గకపోవడంతో రోజురోజుకూ పరిస్ధితి జటిలంగా మారుతోంది.

Farmers plan long term protests as talks with haryana government fails

నిన్న ప్రభుత్వ తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ కర్నాల్ జిల్లా కేంద్రంలోని మినీ సెక్రటటేరియట్ ను ముట్టడించిన రైతు సంఘాలు త్వరలో రాజధాని చంఢీఘడ్ లోనూ భారీ ఆందోళనలు చేపట్టాలని భావిస్తున్నాయి. ప్రభుత్వం కూడా చర్చల్లో పోలీసులపై చర్చలు తీసుకనే విషయంలో ఎలాంటి హామీలు ఇవ్వకపోవడంతో వారి ఆగ్రహం మరింత పెరుగుతోంది. కనీసం లాఠీఛార్జ్ బాధితులకు న్యాయం చేసేందుకు కూడా ప్రభుత్లం ముందుకు రాకపోవడంతో ఇక నిరసనలు మరింత ముమ్మరం చేయాలని నిర్ణయించారు. గతంలో ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రీ, సింఘూ సరిహద్దుల్లో నిరసనలు చేసిన తరహాలోనే హర్యానాలోనూ నిరసనలు చేపట్టాలని రైతు సంఘాలు నిర్ణయించినట్లు బీకేఎస్ నేత రాకేష్ తికాయత్ వెల్లడించారు.

ఆగస్టు 28న లాఠీఛార్జ్ సందర్భంగా రైతుల తలలు పగులగొట్టాలని ఆదేశాలు ఇచ్చిన ఐపీఎస్ అధికారి ఆయుష్ సిన్హాను సస్పెండ్ చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ రోజు ఆయుష్ సిన్హా ఇచ్చిన ఆదేశాలతో రెచ్చిపోయిన పోలీసులు లాఠీఛార్జ్ కు దిగారు. దీంతో పది మంది వరకూ రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్ధితి ఆందోళనకరంగా ఉంది. అయినా ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. దీంతో రైతుల్లో ఆక్రోశం పెరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+