FASTAG KYC update గడువు పొడిగింపు.. ఫాస్టాగ్ అప్డేట్ చేసుకోండిలా!!
జాతీయ రహదారులపైన ప్రయాణం చేసే వారి కోసం టోల్ గేట్ల వద్ద డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ ఫాస్టాగ్ విధానాన్ని అమలులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఫాస్టాగ్ యూజర్లు తమ కేవైసీ ని అప్డేట్ చేయాలని, జనవరి 31 తో ఆ గడువు ముగుస్తుందని నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
తాజాగా ఫాస్టాగ్ యూజర్లు తమ కేవైసీ వివరాలను అప్డేట్ చేయడానికి గడువును పెంచుతూ ఎన్ హెచ్ఏ ఐ ప్రకటన జారీ చేసింది. ఫిబ్రవరి 29వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు, ఇంకా కేవైసీ అనుసంధానం చేయకుండా అసంపూర్ణంగా ఉన్న ఫాస్టాగ్ యూజర్లు తమ కేవైసీ ని అప్డేట్ చేసుకోవాలని పేర్కొంది.

ముందు జనవరి 31 తర్వాత కూడా ఫాస్టాగ్ కేవైసీ అసంపూర్ణంగా ఉంటే, వాటిని బ్యాంకులు డి యాక్టివేట్ చేస్తాయని పేర్కొంది. ఇక తాజా ప్రకటనతో మరోమారు ఫాస్టాగ్ యూజర్ లకు అవకాశం ఇచ్చినట్టు అయింది. ఇక ఫాస్టాగ్ యూజర్లు కేవైసీ అప్డేట్ చేసుకోవడానికి ముందుగా ఫాస్టాగ్ కు సంబంధించిన అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
ప్రమాణీకరణ పూర్తయిన తర్వాత అధికారిక వెబ్సైట్లో మై ప్రొఫైల్ అనే సెక్షన్లో కేవైసీ స్టేటస్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ కేవైసీ అప్డేట్ కాకపోతే మళ్లీ అప్డేట్ చేసుకోవచ్చు. దీనికోసం అవసరమైన ఐడెంటిటీ ప్రూఫ్, వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, అలాగే అడ్రస్ ప్రూఫ్ వంటి వాటితో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవసరమవుతుంది. ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని చివరిగా సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
ఆపై కంటిన్యూ పై క్లిక్ చేసి అందులో పేర్కొన్న ఇతర అవసరమైన డాక్యుమెంట్లను కూడా సబ్మిట్ చేస్తే కేవైసీ వెరిఫికేషన్ కూడా పూర్తవుతుంది. అయితే కొంతమంది ఒకే ఫాస్టాగ్ తో ఒకటి కంటే ఎక్కువ వాహనాలను వినియోగిస్తున్నారని కేవైసీ పూర్తికాకుండానే, ఫాస్టాగ్ లను జారీ చేయడం వల్ల ఈ ఇబ్బంది వచ్చిందని గుర్తించిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కేవైసీ అప్డేట్ కు శ్రీకారం చుట్టింది.












Click it and Unblock the Notifications