విధి రేప్ లాంటిదే.. ఎర్నాకులం కాంగ్రెస్ ఎంపీ భార్య కాంట్రవర్సీ కామెంట్స్

విధి రేప్ లాంటిది. ప్రతిఘటించడం సాధ్యం కాకపోతే దాన్ని ఆస్వాదించాలి అంటూ కేరళ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ఎంపి హిబీ ఇడెన్ భార్య అన్నా లిండా ఇడెన్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఒకపక్కన కేరళ రాష్ట్రం వర్షాలతో అతలాకుతలం అవుతుంటే విధిని రేప్ తో పోలుస్తూ అన్నా లిండా ఇడెన్ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఆమె పెట్టిన పోస్టింగ్‌పై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి.

ఎర్నాకుళం ఎంపి అయిన హిబీ ఇడెన్ భార్య అన్నా లిండా ఇడెన్ ఓ జర్నలిస్ట్. ఆమె తాజాగా పెట్టిన ఫేస్బుక్ పోస్టులో కోచ్చిలో సోమవారం భారీ వర్షం కురిసి వారు ఉంటున్న ఇల్లు జలదిగ్బంధంలో చిక్కుకుంది. నీట మునిగిన తమ ఇంట్లో నుంచి బయట జలదిగ్బంధంలో చిన్నారిని రక్షిస్తున్న క్లిప్పింగులతో కూడిన రెండు షార్ట్ వీడియోలను ఎంపీ భార్య అన్నా లిండా తన ఫేస్‌బుక్‌లో సోమవారం పోస్ట్ చేశారు. వీటితో పాటుగా తన భర్త హిబీ ఇడెన్ ఐస్ క్రీమ్ తింటున్న ఫొటోను పోస్ట్ చేశారు. ఇక దానికి విధి రేప్ లాంటిది..దాన్ని ప్రతిఘటించలేనప్పుడు, ఆస్వాదించడానికి ప్రయత్నించాలి అని ఆమె పెట్టిన క్యాప్షన్‌కు నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

fate is like rape .. Controversy of Ernakulam Congress MP wife on heavy rains

ఒకపక్క రాష్ట్ర భారీ వర్షాలతో అతలాకుతలం అవుతుంటే, జలదిగ్బంధంలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఒక ఎంపీ స్థాయిలో ఉండి ఐస్ క్రీమ్ తింటూ భారీ వర్షాలను ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఆమె పెట్టిన పోస్ట్ పై మండిపడుతున్నారు నెటిజన్లు. ఇక అంతే కాదు విధిని రేప్ తో పోలుస్తూ అసంబద్ధమైన వ్యాఖ్యలు రాసినందుకు వారు ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఎర్నాకులం ఎంపీ హిబీ ఇడెన్, మరియు ఆయన భార్య అన్నా లిండా ఇడెన్ పై ఆ రాష్ట్ర ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం అన్నా లిండా ఇడెన్ ఆ పోస్ట్ ను తొలగించారు. ఇక దీనిపై అన్నా లిండా ఇడెన్ కానీ హిబీ ఇడెన్ కాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+